NTV Telugu Site icon

Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్‌ సమస్యలపై ఫోకస్‌ పెట్టిన కేంద్రం.. రేపు విశాఖకు ఉక్కు మంత్రి..

Hd Kumaraswamy

Hd Kumaraswamy

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్‌ పెట్టినట్టుగా తెలుస్తోంది.. అందులో భాగంగా రేపు రాత్రికి విశాఖకు రానున్నారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమార స్వామి… ఎల్లుండి స్టీల్ ప్లాంట్ ను సందర్శించనున్నారు.. ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.. పెట్టుబడులు ఉపసంహరణ ప్రకటన తర్వాత తొలిసారి కేంద్ర ఉక్కు మంత్రి విశాఖకు రాబోతున్నారు.. దీంతో.. స్టీల్‌ ప్లాంట్‌ సమస్యలకు క్రమంగా పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు.. ఇక, విశాఖ పర్యటన తర్వాత హైదారాబాద్ వెళ్లనున్నారు కుమార స్వామి.. అక్కడ NMDC అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.. విశాఖ ఉక్కు ఆర్థిక నష్టాలు, గనులు., ముడి ఖనిజాల కొరత పరిష్కారం దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు..

Read Also: Xiaomi SU7: Xiaomi SU7 ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది.. ఒక్క ఛార్జ్‌తో 800 కి.మీ రేంజ్..

అయితే, సెయిల్ లో విలీనం చెయ్యాలని డిమాండ్ చేస్తోంది విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ.. మరోవైపు, విశాఖ ఉక్కు పరిరక్షణ బాధ్యత తీసుకుంటామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో.. కేంద్ర ఉక్కు మంత్రి.. విశాఖపట్నం పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.. కాగా, వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసింది ప్రభుత్వం.. అయితే, ఉద్యోగులు, కార్మికులతో పాటు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయింది.. ఆ ఆందోళన, నిరసన కార్యక్రమాలకు కార్మిక సంఘాలు, ప్రజా నాయకులు.. వివిధ రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి.. దీంతో.. కేంద్రం వెనక్కి తగ్గింది.. ఇక, ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో.. సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నట్టుగా తెలుస్తోంది.

Read Also: MP Shocker: నర్సుపై సహోద్యోగి అత్యాచారం.. బెదిరిస్తూ రెండేళ్లుగా అఘాయిత్యం..

ఇక, ఉక్కు మంత్రి హెచ్‌డీ కుమారస్వామి బుధవారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ – ఆర్‌ఎన్‌ఐఎల్) ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని అధికారులను ఆదేశించిన విషయం విదితమే. అంతేకాకుండా.. కంపెనీకి ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్లాంట్‌ను లాభసాటిగా మార్చడంతోపాటు సంస్థకు ఆర్థికంగా పునరుత్తేజం కల్పించేందుకు కంపెనీ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థను ఉక్కు ఉత్పత్తిని పెంచాలని అధికారులను ఆదేశించిన మంత్రి, కంపెనీ కార్యకలాపాలు, ఆర్థిక స్థితి, ఉత్పత్తి మరియు కొత్త కార్యక్రమాల గురించి అధికారుల నుండి సమగ్ర సమాచారాన్ని తీసుకున్నారు. ఉత్పత్తి, సామర్థ్యం పెంపుపై దృష్టి సారించాలని ప్రభుత్వరంగ సంస్థ అధికారులను ఆదేశించిన మంత్రి, కంపెనీకి ఆర్థిక సహకారం అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని హామీ ఇచ్చారని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఏటా 300 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారని, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి హెచ్‌డీ కుమారస్వామి వెల్లడించిన విషయం విదితమే.