చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. విశాఖలో జీఎంఆర్, మాన్ సాస్ ఏవియేషన్ ఎడ్యూ సిటీ ఒప్పంద కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడు పాల్గొని మాట్లాడారు. ఇన్నేళ్లుగా వెనుకబడిందని చెప్పుకుంటూ వచ్చిన ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టిందని తెలిపారు.
ఉత్తరాంధ్రకు ఎన్టీఆర్ గుర్తింపు తెస్తే.. అభివృద్ధి మాత్రం చంద్రబాబు హయాంలో జరుగుతోందని చెప్పారు. అభివృద్ధి ప్రణాళికల అమల్లో చంద్రబాబే నిద్రపోనివ్వరంటే.. ఇప్పుడు లోకేష్ అసలే పడుకోనివ్వడం లేదన్నారు. పార్టీలు.. రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకోవడం సరైన విధానం కాదని వ్యాఖ్యానించారు. రూ.10 వేలు డొనేషన్ ఇచ్చి లక్ష రూపాయల పబ్లిసిటీ చేసుకునే రోజుల్లోనూ నానో కారులో తిరుగుతూ సింపుల్‌గా ఉండే నాయకుడు అశోక్‌గజపతిరాజు అని కొనియాడారు.
