Pawan Kalyan: సుగాలి ప్రీతి కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తాను, డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించగానే నేను తీసుకున్న తొలి నిర్ణయం సుగాలి ప్రీతి కేసు అని గుర్తుచేసుకున్నారు.. ఆ పాపకి న్యాయం జరగాలి ఏమీ ఏమీ జరిగింది అని అడిగా? సుగాలి ప్రీతి కేసు త్వరిత పరిష్కారం కోసం నేను సిఫారసు చేశాను.. సీఐడీ చీఫ్, డీఐజీ, హోం మంత్రికి వెంటనే ఆదేశాలు ఇచ్చాను.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని నేను స్పష్టంగా చెప్పాను అన్నారు. అయితే, అప్పట్లో ఎవరైతే కుట్ర వెనుక ఉండి చెపుతున్నారో DNA తారుమారు చేశారు.. ఒత్తిడి చేసి భూములు అన్ని ఇచ్చేసి సాక్ష్యాలు తారుమారు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.. DNA సాక్ష్యాలు మ్యాచ్ కావడం లేదు అని పోలీసులు చెపుతున్నారు ఇది వాస్తవం.. వివేకానందరెడ్డి గారిని చంపేశారు అని అందరకి తెలుసు.. ఎవరు అయితే నిందితులు ఉన్నారో ఒక్కొక్కరిని చంపేస్తున్నారు.. మరి గత ఐదు సంవత్సరాల్లో క్లాసిక్ కేసెస్ ప్రక్షాళానికే పూనుకున్నాం.. ఒక్కొక్క కేసును పరిష్కరిస్తామని పేర్కొన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
Read Also: IND vs PAK Tickets Price: భారత్-పాక్ మ్యాచ్.. ఒక్కో టిక్కెట్ ధర ఎన్ని లక్షలంటే..?
కాగా, తన కూతురు సుగాలి ప్రీతి హత్య కేసులో న్యాయం చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎం అయ్యాక ఆ విషయాన్ని పట్టించుకోవటం లేదని సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆరోపించారు.. విజయవాడలో ఆమె మీడియాతో మాటాడారు. తన కూతుర్ని అతి కిరాయతంగా అత్యాచారం చేసి హత్య చేశారని 8 సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నా అన్నారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఉపముఖ్యమంత్రి ఐయినా తరువాత గాలికి వదిలేశారని విమర్శించారు. మొదటి సంతకం సుగాలి ప్రీతి ఫైల్ పై అన్నారని.. గెలిచి 14 నెలలు అవుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సుగాలి ప్రీతి కేసుపై చర్చించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకుని వచ్చి సీబీఐ ఎంక్వయిరీ వేయాలని డిమాండ్ చేశారు. హోం మంత్రికి శ్రీకాంత్ పెరోల్ పై ఉన్న దృష్టి నా కూతురు విషయంలో లేదని మండిపడ్డారు.. గవర్నర్ అపాయింట్‌మెంట్ తీసుకొని నాకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తానని.. జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని సుగాలి ప్రీతి తల్లి పార్వతి హెచ్చరించిన విషయం విదితమే..
