Andhra Premier League: విశాఖ వేదికగా ఈ రోజు సాయంత్రం ఏపీఎల్ సీజన్ -4 ప్రారంభం కాబోతుంది. ఏసీఏ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఏపీఎల్ సీజన్ -4 ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఏపీఎల్ సీజన్ -4 ఓపెనింగ్ సెర్మనీకి ముఖ్యఅతిథులుగా కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, హీరో వెంకటేష్ హాజరు కానున్నారు. అయితే, ఎపీఎల్ సీజన్ -4కి హీరో విక్టరీ వెంకటేష్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల లైవ్ పెర్పామెన్స్ ఇవ్వనున్నారు.
Read Also: Bollywood : స్టార్ హీరోల రికార్డ్స్ బద్దలు కొట్టి రూ. 500 కోట్లు కొల్లగొట్టిన చిన్న సినిమా..
అయితే, ఏపీఎల్ సీజన్ -4 టోర్నీ తొలి మ్యాచ్ లో కాకినాడ కింగ్స్ – అమరావతి రాయల్స్ తలపడబోతున్నాయి. ఈ రోజు సాయంత్రం 7:30 నిమిషాలకు ఏపీఎల్ సీజన్ -4 లో తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. ప్రారంభోత్సవ వేడుకలు ఈ రోజు సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. ఏపీఎల్ సీజన్ -4 మ్యాచులు వీక్షించేందుకు ఏసీఎ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ ఫ్రీ ఎంట్రీ అవకాశం కల్పించారు. ప్రేక్షకులకు స్టేడియం గేట్ నెంబర్ 15 నుంచి ఎంట్రీకి అవకాశం ఉంది. ఏపీఎల్ సీజన్ -4లో ఏడు జట్లు తలపడబోతున్నాయి.
Read Also: Kesamudram: అర్ధరాత్రి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం!
ఇక, ఏపీఎల్ సీజన్ 4లో జరిగే 25 మ్యాచులో 21 లీగ్ మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్స్ జరుగుతాయి. ఏపీఎల్ సీజన్ -4లో విజయవాడ సన్ షైనర్స్, రాయల్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్ , అమరావతి రాయల్స్, కాకినాడ కింగ్స్, భీమవరం బుల్స్ జట్లు పోటీ పడనున్నాయి. కాగా, ప్లేయర్స్ ను ప్రోత్సహించటానికి భారీ స్థాయిలో ప్రైజ్ మనీని కూడా నిర్వహకులు ప్రకటించారు. ఏపీఎల్ సీజన్ -4 విన్నర్ జట్టుకి రూ. 35 లక్షల ప్రైజ్ మనీ, రన్నరప్ టీమ్ కి రూ.20 లక్షలు ఇవ్వనున్నారు.
