Site icon NTV Telugu

యోగాలో గిన్నిస్ రికార్డ్.. చైనాలో అనకాపల్లి వాసి ఘనత

konatala vijay

konatala vijay

విశాఖ జిల్లా అనకాపల్లిలో పుట్టి చైనాలో యోగా గురువుగా ప్రఖ్యాతి గాంచిన కొణతాల విజయ్ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించారు. చైనాలోని జెంజూ నగరంలో ఆగష్ట్ 4న అష్టవక్రాసనాన్ని 2.32 నిమిషాలపాటు ప్రదర్శించి ఈ ఘనత సాధించారు. విజయ్ భార్య జ్యోతి కొద్ది నెలల క్రితం గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించుకున్నారు. నిండు గర్భంతో యోగాసనాలు వేసి ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పారు.

విజయ్ చదువుకునే సమయంలోనే యోగా నేర్చుకున్నారు. తర్వాత నృత్యంలో మెలకువలు సంపాదించి స్టార్ డాన్సర్ గా గుర్తింపు పొందారు. పలు దేశాల్లో డాన్స్ శిక్షకుడిగా పనిచేసిన ఆయన చైనాలో స్థిరపడి నృత్యం, యోగా విద్యలో శిక్షణ ఇస్తున్నారు. అష్టవక్రాసనం చేయడం అంత ఈజీ కాదు.. శరీర బరువును చేతులపై ఉంచి రెండు కాళ్లను గాల్లో పెట్టి ఎనిమిది ఆకారంలో కనిపించాలి.. ఎంతటి యోగా గురువు అయినా ఈ ఆసనం ఎక్కువ చేయలేరు.. కానీ విజయ్ ఆ ఆసనాన్ని అవలీలగా చేసేశాడు. ఇదంతా ప్రాక్టీస్ ద్వారానే వీలయ్యిందని ఆయన తెలిపారు. అనకాపల్లి వాసి చైనాలో ఇంతటి ఘనతను సాధించినందుకు ఆ గ్రామస్థులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. అందులోను బార్యభర్తలిద్దరూ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకోవడం అరుదైన విషయమని కొనియాడుతున్నారు.


Exit mobile version