NTV Telugu Site icon

Jaggery Ganesh Immersion: నేడు గాజువాకలో 75 అడుగుల బెల్లం వినాయకుడి నిమజ్జనం

Jaggery Ganesh

Jaggery Ganesh

Jaggery Ganesh Immersion: తొమ్మిరోజుల పాటు.. 11 రోజుల పాటు.. 15 రోజుల పాటు.. ఇలా పూజలు అందుకున్న వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేశారు భక్తులు.. అయితే, ఈ సారి గాజువాకలో ఏర్పాటు చేసిన 75 అడుగుల బెల్లం వినాయకుడిని ఈ రోజు నిమజ్జనం చేయనున్నారు.. 21 రోజుల పాటు పూజలు అందుకున్న లంభోదరుడుని.. నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. గ్రేటర్‌ విశాఖ పరిధిలోని గాజువాక డిపో వద్ద.. ఈ అత్యంత భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే.. లంబోదర ట్రస్టు ఆధ్వర్యంలో బెల్లం ముద్దులతో 75 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.. ఈ విగ్రహం ఏర్పాటు కోసం ఏకంగా 18 టన్నుల బెల్లం కుందులను వినిగించినట్టు లంబోదర ట్రస్ట్‌ ఛైర్మన్‌ మొల్లి గోవర్థన్‌ ప్రకటించిన విషయం విదితమే..

Read Also: Delhi : నలుగురు దివ్యాంగ కుమార్తెలతో సహా తండ్రి ఆత్మహత్య.. కుళ్లిన స్థితిలో మృతదేహాలు

బెల్లం దిమ్మెలను క్రమపద్ధతిలో అమర్చుతూ భారీ ఆకారాన్ని తీర్చిదిద్దారు. అనకాపల్లికి చెందిన శిల్పులు రెండు నెలలకు పైగా కష్టపడి ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఇందు కోసం అవసరమైన బెల్లం రాజస్ధాన్ నుంచి రప్పించారు. 21 రోజుల పాటు భక్తుల దర్శనాలక అను గుణంగా ఈ మండపం రూపొందింది. స్ధానికంగా లభించే బెల్లం వాతావరణ పరిస్ధితులకు తట్టుకుని నిలబడదని గుర్తించి రాజస్ధాన్ నుంచి తెప్పించారు. అక్కడ తయారయ్యే బెల్లం రాజస్ధాన్ లో వుండే వేడి వాతావరణకు తట్టుకుంటుంది. ఎక్కువ రోజులు నిల్వ వుంటుంది కనుక ఇంపోర్ట్ చేసుకుని బెల్లంతో ఈ భారీ గణనాథుడిని సిద్ధం చేశామని నిర్వాహకులు చెబుతున్నారు.. భారీ బెల్లం గణనాథుడు ఏర్పాటు చేయడం ఒక ఎత్తైతే.. అందుకు పాటించిన జాగ్రత్తలు చాలా ప్రధానంగా చెప్పుకోవాలి.. మొత్తంగా 21 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు.. ఈ రోజు నిమజ్జనం కానున్నారు.. నిమజ్జనం రోజు బెల్లం భక్తులకు పంచిపెడతామన్నా కమిటీ నిర్వాహకులు ముందుగానే ప్రకటించిన నేపథ్యంఓల.. బెల్లం వితరణపై పోలీసుల ఆంక్షలు విధించారు.. బెల్లం భక్తులు తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉందని బెల్లం కరిగించమని ఆదేశాలు జారీ చేశారు..