Site icon NTV Telugu

DGP Harish Gupta: యువత డ్రగ్స్, గంజాయిని తరిమికొట్టాలి..

Dgp

Dgp

DGP Harish Gupta: విశాఖపట్నంలోని పరదేశీ పాలెం డంపింగ్ యార్డులో గంజాయి డిస్ట్రక్షన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిందేరా ప్రసాద్, డీజీపీ హరీష్ గుప్తా, సీపీ శంఖ భ్రత బాగ్చి, ఈగల్ చీఫ్ ఆకే రవి కృష్ణ, పోలీస్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. పలు కేసుల్లో పట్టుబడ్డ 10,200 కేజీల గంజాయిని తగల బెట్టనున్నార. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. 5 కోట్ల 21 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిని ధ్వంసం చేస్తున్నాం.. మొత్తం 533 గంజాయి కేసుల్లో పట్టుబడిన గంజాయి.. 1435 నిందితులను గంజాయి కేసుల్లో అరెస్ట్ చేశాం.. అందులో 712 విశాఖలో అరెస్ట్ చేయగా, మిగతా 332 ఏపీలో మిగతా జిల్లాలకు చెందిన వారు, 391 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.

Read Also: KTR: “డోంట్‌ వరీ”.. మరో 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం..

అయితే, ఈగల్ టీమ్స్ ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ సేఫ్ హాండ్స్ పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది అని డీజీపీ హరీష్ గుప్తా పేర్కొన్నారు. సింతటిక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.. వాటిని యువత కొనుగోలు చేస్తే ఆ డబ్బులు టెర్రరిస్టులకు చేరుతుంది.. ఆ విధంగా టెర్రరిస్టులను ప్రోత్సహించినట్లు అవుతుందని చెప్పారు. కాబట్టి యువత డ్రగ్స్, గంజాయిని తరిమికొట్టాలి అని పిలుపునిచ్చారు. ప్రజలే మాకు ఇన్ఫార్మర్లు.. ఏజెన్సీలో గంజాయి పూర్తిగా నిర్మూలన జరుగుతుంది.. చెక్ పోస్టులను బలోపేతం చేస్తున్నాం.. గంజాయి స్మగ్లర్లను టెర్రరిస్టులుగా భావిస్తున్నాం.. NDPS యాక్ట్స్ ద్వారా గంజాయి స్మగ్లర్స్ ఆస్తులను జప్తు చేస్తున్నాం.. యువత మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళకండి, మీ భవిష్యత్త్ లను నాశనం చేసుకోకండి అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.

Exit mobile version