విశాఖపట్నంలో గోవా గవర్నర్ పూసపాటి ఆశోక్ గజపతి రాజుకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా సంవత్సరాలు ప్రభుత్వంలో మంత్రిగా పని చేశాను.విశాఖ లో ప్రజా ధనం తో కట్టిన ఋషి కొండ ప్యాలస్ పెచ్చులు ఉడిపోయాయి అని తెలిసింది.ఆ భవనం కోసం ఖర్చు పెట్టిన 600- 700 కోట్లు ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అయ్యేది అనుకునే వాడిని….ఈ ప్యాలస్ ఏం చెయ్యాలని ప్రభుత్వం ప్రజలను అడుగుతోంది…దానిని పిచ్చి ఆసుపత్రి చేస్తే మంచిదని ఆయన ఉచిత సలహా ఇచ్చారు…..కనీసం దానినీ కట్టిన దుర్మార్గులు కి ఆ సముద్ర గాలి తగులుతుంది అనుకున్నాం…ఆ భవనం మీద రిటర్న్స్ రావన్నారు.
ప్రజాధనాన్ని ,ప్రజా హితం కోసం వాడాలి….మా అందరిన్ని ఇబ్బంది పెట్టారు….మనో బలంగా నిలబడాలి లొంగి పోకూడదు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు వదిలిన వారికి త్యాగానికి మనమే విలువ ఇస్తున్నామా ఆలోచించాలి…మన వీర సైనికులు ప్రపంచానికి మన సత్తా చూపించారు.అన్ని దేశాలకు ఒక పాఠం నేర్పించామన్నారాయన.
