విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద మాయమైనప్పటి నుంచి సాయిప్రియ ఒకదానికి మించి మరొక ట్విస్టులు ఇస్తూనే ఉంది. సముద్రంలో గల్లంతయ్యిందనుకుంటే.. బెంగుళూరులో ప్రియుడు రవితో ప్రత్యక్షమైంది. ఇంతలోనే అతనితో తనకు వివాహమైందంటూ షాకిచ్చింది. తనని వెతకొద్దని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అయితే.. సాయిప్రియ ఆడిన డ్రామాపై కోస్ట్ గార్డ్ సీరియస్ అయింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ వైజాగ్ పోలీస్ కమిషనర్ తో పాటు జీవీఎంసీ కమిషనర్ కు మెయిల్ చేసింది. తప్పుడు సమాచారంతో అత్యంత ఖర్చుతో కూడిన మూడు కోస్ట్ గార్డ్ షిప్స్, ఒక హెలికాప్టర్ ను రెస్క్యూకి పంపించామని, అత్యంత విలువైన మానవసేవలు వృథా అయ్యిందని, మరోసారి ఇలా జరగకుండా ఉండాలంటే సాయి ప్రియాంకపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు, జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసింది. మరి సాయిప్రియ చేసిన హైడ్రామాపై అధికారుల రియాక్షన్ ఎలా వుంటుందో చూడాలి. మరొక సారి ఇలాంటి తప్పులు చేయడానికి వీలు లేకుండా చూడాలని స్థానికులు అంటున్నారు.
read also: Vijayashanti : వానపాముల పప్పు… పురుగుల అన్నం..
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద మాయమై బెంగుళూరులో ఉన్న సాయిప్రియ దంపతుల ఆచూకీ తెలుసుకొని.. పోలీసులు వారిని విశాఖకు తరలించిన విషయం తెలిసిందే! దీంతో.. సాయిప్రియ మరో కొత్త డ్రామా ప్రారంభించింది. బంధువుల నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఫిర్యాదు కూడా చేసింది. వివాహ కానుకగా తన భర్త శ్రీనివాస్ ఇచ్చిన బంగారు గాజుల్ని సాయిప్రియ అమ్మినట్టు తేలింది. ఆ అమ్మిన డబ్బులతోనే తన ప్రియుడు రవితో రెండు రోజుల పాటు దర్జాగా గడిపింది. ఇంత రాద్ధాంతం చేసిన సాయిప్రియ ఫేస్‌లో కనీసం పశ్చాత్తాప భావనలు కూడా కనిపించడం లేదని తెలిసింది.
Sanjay Raut: సంజయ్ రౌత్ కు ఈడీ షాక్.. మరోసారి సోదాలు