NTV Telugu Site icon

విశాఖ పోలీసుల కీల‌క నిర్ణ‌యం: సాయంత్రం 5 త‌రువాత బీచ్‌లో క‌నిపిస్తే…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోజువారీ కేసులు వెయ్యికిపైగా న‌మోద‌వుతున్నాయి.  ఏపీలో మిగ‌తా ప్రాంతాల‌తో పోలిస్తే ఉత్త‌రాంధ్ర‌లో కేసులు త‌క్కువ‌గా న‌మోద‌వుతున్నాయి.  ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల‌తో పోలిస్తే, విశాఖ‌లో ఎక్కువ కేసులు న‌మోద‌వుతున్నాయి.  ముఖ్యంగా వీకెండ్స్‌లో కేసులు పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.  ఆంక్ష‌ల‌పై స‌డ‌లింపులు ఇచ్చిన త‌రువాత విశాఖ బీచ్‌కు తాకిడి పెరిగింది.  శ‌ని, ఆదివారాల్లో పెద్ద‌సంఖ్య‌లో బీచ్‌కు ప‌ర్యాట‌కులు త‌ర‌లి వ‌స్తున్నారు.  ఒక్క విశాఖ నుంచే కాకుండా చుట్టుప‌క్క‌ల ప్రాంతాల నుంచి విశాఖ బీచ్‌కు ప‌ర్యాట‌కులు త‌ర‌లి వ‌స్తుండ‌టంతో పోలీసులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.  వీకెండ్స్‌లో విశాఖ బీచ్‌లో సాయంత్రం 5 త‌రువాత ఎవ‌రూ ఉండ‌కూడ‌ద‌ని, ఒక‌వేళ సాయంత్రం 5 త‌రువాత బీచ్‌లో ఎవ‌రైనా క‌నిపిస్తే వారిపై కేసులు న‌మోదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు.  క‌రోనాను కంట్రోల్ చేయ‌డానికి ఇదొక్క‌టే ప్ర‌స్తుతానికి మార్గ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.  

Read: నడుము నొప్పి వేదిస్తుందా? ఈ చిట్కాలతో మటు మాయం