Site icon NTV Telugu

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాల్లో కోత

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఊహించని షాక్‌ తగిలింది. ఇప్పటికే వారు ప్రొబేషన్‌ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ఇది ఊహించని పరిణామం. బయోమెట్రిక్‌ హాజరు లేదని అక్టోబర్‌ జీతంలో 10 నుంచి 50శాతం వరకు తగ్గించారు. సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌22 వరకు హాజరు డాటా ఆధారంగానే ఉద్యోగులకు జీతాలను వేయాలి. కానీ బయోమెట్రిక్‌ మెషీన్లలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించకుండా తమ జీతాల్లో కోత విధించడమేంటని ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యను పరిష్కరించి తమ జీతాల్లో కోతలు విధించకుండా జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Exit mobile version