Site icon NTV Telugu

Vangaveeti Narendra: పవన్‌ కల్యాణ్‌పై వంగవీటి ఫైర్‌.. లక్షల పుస్తకాలు చదివిన మీరు రాజ్యాంగాన్ని చదివారా..?

Vangaveeti Narendra

Vangaveeti Narendra

Vangaveeti Narendra: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై ఫైర్‌ అయ్యారు వైసీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర.. రాజ్యాంగం గురించి మాట్లాడే పవన్ కల్యాణ్‌కు అసలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దారుణాలు కనడుతున్నాయా? అని ప్రశ్నించారు.. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం గురించి ఎన్నికలకు ముందు మీరు మాట్లాడిన మాటలను గుర్తు చేస్తే దాడి చేస్తారా? అని నిలదీశారు.. ఇదేనా రాజ్యాంగ బద్దమైన పాలన అంటే? అని ఫైర్‌ అయ్యారు.. లక్షల పుస్తకాలు చదివిన పవన్ కల్యా్ణ్ అసలు రాజ్యాంగాన్ని చదివారా? అని మండిపడ్డారు.. మచిలీపట్నం మంగినపూడిలో మా పార్టీ నేత గిరిపై జనసేన నేతల దాడి అమానుషం అన్నారు.. పెద్దమనిషిని మోకాళ్లపై పెట్టి దాడి చేయమని ఏ రాజ్యాంగం లో ఉంది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారన్న మీ వ్యాఖ్యలకు మీరే సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.. ఈ ప్రశ్న అడిగితే మా పార్టీ నేతపై దాడి చేశారు. జగన్ కు రాజ్యాంగం తెలుసు కాబట్టే ప్రతిపక్ష హోదా అడిగారని తెలిపారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర..

Read Also: Mirai : మనోజ్ కు కలిసొచ్చిన మోహన్ బాబు ఫార్ములా

Exit mobile version