Site icon NTV Telugu

Ravi Naidu Animini: ఇంటర్నేషనల్ స్టేడియంగా మారనున్న ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం..!

Ravi Naidu Animini

Ravi Naidu Animini

Ravi Naidu Animini: విజయవాడలో దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంకు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రణాళికలు చేస్తున్నారు.. స్పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మున్సిపల్‌ శాఖ సంయుక్తంగా ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియం అభివృద్ధి చేయనున్నారు.. 50 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయాలని, తగిన పరిపాలనా అనుమతులు తీసుకుని అభివృద్ధి చేస్తామని అంటున్నారు శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు.. అన్ని రకాల క్రీడాకారులకు శిక్షణా కేంద్రం సహా, ఇంటర్నేషనల్ స్టేడియం గా అభివృద్ధి చేస్తున్నాం అని వెల్లడించారు..

Read Also: iBomma Ravi: ఐ బొమ్మ రవికి షాక్ ఇవ్వనున్న సైబర్ క్రైమ్ పోలీసులు..

త్వరలో ఇంటర్నేషనల్ స్టేడియంగా ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం మారుతుందన్నారు రవి నాయుడు.. ఖేలో ఇండియా స్ధాయిలో క్రీడల నిర్వహణకు ప్రణాళికలు చేస్తున్నాం అన్నారు.. పరిపాలనా అనుమతులతో 50 కోట్ల తో అభివృద్ధి పనులు చేస్తాం అని వెల్లడించారు.. ఇప్పటికే రెండు డీపీఆర్‌లు సిద్ధం అవుతున్నాయని.. రెండింటిలో ఒక డీపీఆర్ కు మున్సిపల్‌, క్రీడా శాఖలు ఆమోదం తెలుపుతాయన్నారు.. మొత్తం 13 ఎకరాలలో అభివృద్ధి జరుగుతుంది.. మిగిలిన 3 ఎకరాల కమర్షియల్ ప్రాంతం మున్సిపల్‌ శాఖ పరిధిలోనే ఉంటుంది.. మున్సిపల్‌, క్రీడా శాఖల 50-50 ఒప్పందంతో అభివృద్ధికి ప్లానింగ్‌ జరుగుతుందన్నారు.. ట్రైనింగ్ సెంటర్ ను సైతం ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందింస్తున్నాం.. అన్ని రకాల క్రీడాకారులకు ప్రయోజనం చేకూరేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు..

Exit mobile version