Vallabhaneni Vamsi Case: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.. వల్లభనేని వంశీ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు.. బెయిల్ మంజూరు చేయాలని వాదనలు వినిపించారు వంశీ తరుపున న్యాయవాది సత్య శ్రీ.. ఇక, ఈ కేసుకు వంశీకు ఎలాంటి సంబంధంలేదని కూడా వాదించారు.. ఇది కేవలం రాజకీయంగా కక్షసాధింపు చర్యల్లో భాగంగానే జరిగిందని.. అందుకే వంశీపై కేసుపెట్టారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. మరోవైపు.. ఇప్పటికే వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించింది ప్రభుత్వం.. వంశీ తరపుపు న్యాయవాది వాదనలు ముగిసిన తర్వాత.. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు..
Read Also: CM Revanth Reddy: బీజేపీ దక్షిణాదిపై పగబట్టినట్లు వ్యవహరిస్తోంది..
ఇక, వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 17వ తేదీన మరోసారి కోర్టులో తమ వాదనలు వినిపించనున్నారు ఇరువైపులా న్యాయవాదులు.. కాగా, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ రిమాండ్‌ను ఈ నెల 25వ తేదీ వరకు కోర్టు పొడిగించిన విషయం విదితమే.. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పని చేసిన కంప్యూటర్ ఆపరేటర్‌ను కిడ్నాప్ చేసి, బెదిరింపులకు దిగిన కేసులో వల్లభనేని వంశీతో పాటు అతడి అనుచరులను కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో 2023లో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటన అప్పట్లో సంచలనంగా మారింది.
