Site icon NTV Telugu

Road Accident: బోల్తా కొట్టిన కారు.. నలుగురు మృతి.. ఎయిర్‌ బ్యాగ్స్‌ ఓపెయిన్‌ అయినా దక్కని ప్రాణాలు..!

Road Accident

Road Accident

Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రోడ్డు ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ప్రతీ రోజూ ఏదో ఒకటి రెండు చోట్ల ప్రమాదాలు జరగడం.. కొంతమంది మృతిచెందిన ఘటనలు వెలగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా, విజయవాడ ఉయ్యూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.. విజయవాడ – మచిలీపట్నం హైవేపై ఉయ్యూరు సమీపంలోని గండిగుంట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు వెళ్తున్న టాటా సఫారీ వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. అందులో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం పాలయ్యారు. అయితే, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినా ప్రాణాలు దక్కలేదు. ప్రమాద తీవ్రతకు కారు మొత్తం నుజ్జు నుజ్జు అయింది. హైవే పై నుంచి అదుపుతప్పి సర్వీసు రోడ్డులోకి బోల్తా కొట్టి 50 మీటర్లు పల్టీ కొట్టడంతో ఘటన స్థలం భీభత్సంగా మారింది.

Read Also: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్లో మందకొడిగా ఓటింగ్.. ఉదయం 9 గంటల వరకు ఎంతంటే..?

ఇక, ఉయ్యూరు దగ్గర రోడ్డు ప్రమాదంలో మృతులను గుర్తించారు.. విజయవాడకి చెందిన ప్రిన్స్ బాబు, చాట్రగడ్డ రాకేష్ బాబు , కుందేరుకి చెందిన చింతయ్య మృతులుగా గుర్తించారు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాపనయ్య పరిస్థితి కూడా విషమంగా ఉంది.. మచిలీపట్నం వెళ్తుండగా విజయవాడ – మచిలీపట్నం హైవే పై తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది.. ప్రమాద స్థలంలోనే ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు..

Exit mobile version