Site icon NTV Telugu

Gold Price: విజయవాడలో కనిపించని ధన త్రయోదశి ఎఫెక్ట్..

Vja

Vja

Gold Price: విజయవాడ నగరంలో ధన త్రయోదశి ఎఫెక్ట్ కనిపించడం లేదు. బంగారం దుకాణాల దగ్గర రద్దీ కనిపించలేదు. గత ఏడాదితో పోలిస్తే 80 శాతానికి పైగా గోల్డ్ ధరలు పెరిగాయి. గత ఏడాది ధన త్రయోదశి సమయానికి 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర 7200 రూపాయలు ఉండగా, ఈ ఏడాది గ్రాము ధర 13,200 రూపాయలకు చేరుకుంది. రెట్టింపు ధరలకు బంగారం రేట్లు పెరగటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపడం లేదు.

Read Also: Huawei Nova Flip S: హువావే కొత్త ఫోల్డబుల్ ఫోన్ 2.14-అంగుళాల కవర్ స్క్రీన్‌తో విడుదల.. ధర ఎంతంటే?

ఇక, ధన త్రయోదశి సెంటిమెంట్ కారణంగా గత ఏడాదితో పోలిస్తే కేవలం సగానికి పైగా తగ్గించి బంగారం కొనుగోలు చేశామంటున్నారు గోల్డ్ ప్రియులు. బంగారం షాపుల్లో 50 శాతానికి పైగా బంగారం అమ్మకాలు తగ్గిపోయాయి. రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలతో వేచి చూసే ధోరణిలో పసిడి ప్రియులు ఉన్నారు. దీంతో ఈసారి గోల్డ్ కొనుగోలు తగ్గిపోవడంతో వ్యాపారులు సైతం కొంతమేర ఇబ్బందులు పడుతున్నారు.

Exit mobile version