Monkeypox: దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి.. దీంతో విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలతో మంకీపాక్స్కు ప్రత్యేక వార్డును వైద్య అధికారులు ఏర్పాటు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కేసులు వస్తే సంసిద్ధంగా ఉండేలా ఆరు పడకలతో ప్రత్యేక వార్డును అధికారులు ఏర్పాటు చేశారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అన్ని రకాల ఇంజెక్షన్లు సిద్ధం చేసిన వైద్య అధికారులు.. మంకీపాక్స్ కు సపోర్టు ట్రీట్మెంట్ మాత్రమే ఉందంటున్న వైద్యులు.. ప్రత్యేక మందు అనేది మంకీపాక్స్ కు లేదని వెల్లడించారు.
అయితే, ఒకరి నుంచి ఒకరికి మంకీపాక్స్ పాకే అవకాశం ఉంది అని వైద్యులు తెలిపారు. ఐసోలేషన్ వార్డు ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇక, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌లో వార్డును ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేష్ తెలిపారు. వదంతులను ప్రజలు నమ్మవద్దని, ఒకవేళ ఆ వ్యాధి వ్యాప్తి చెందితే తగిన చర్యలు తీసుకునేందుకు అన్ని విధాలుగా తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
