Site icon NTV Telugu

Posani Krishna Murali: పోసానికి మరో షాక్‌.. 20వ తేదీ వరకు రిమాండ్‌

Posani Krishna Murali

Posani Krishna Murali

Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి మరో షాక్‌ తగిలినట్టు అయ్యింది.. పోసానికి ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది విజయవాడలోని సీఎంఎం కోర్టు.. ఈ రోజు సీఎంఎం కోర్టులో పోసానిని హాజరు పరిచారు పోలీసులు.. అయితే, తనపై అక్రమంగా కేసులు పెట్టారని న్యాయాధికారికి చెప్పారు పోసాని.. ఒకే విధమైన కేసులతో అన్ని ప్రాంతాలు తిప్పుతున్నారన్న ఆవేదన వ్యక్తం చేశారు.. నేను అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నాను అని న్యామూర్తి ఎదుట గోడు వెల్లబోసుకున్నారు.. నాకు గుండె జబ్బు, పక్షవాతం వంటి రుగ్మతలు ఉన్నాయన్నారు.. తన ఆరోగ్య పరిస్థితిపై న్యాయమూర్తికి వివరించిన పోసాని.. కోర్టు హాల్లో గతంలో తనకు జరిగిన ఆపరేషన్ గురించి కూడా న్యాయమూర్తికి చూపించారు.. పోసాని చెప్తున్న ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా విన్నారు న్యాయమూర్తి..

Read Also: Chamala Kiran Kumar Reddy: కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తారు? మేం ఎదురుచూస్తున్నాం

అయితే, పీటీ వారెంట్‌పై కర్నూలు జిల్లా జైలు నుంచి వియవాడలోని భవానీపురం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు.. వైద్య పరీక్షల తర్వాత విజయవాడ సీఎంఎం కోర్టులో హాజరుపర్చారు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మంత్రి నారా లోకేష్‌.. వారి కుటుంబ సభ్యులు దూషించడం, సోయల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ జనసేన పార్టీకి చెందిన శంకర్‌ ఫర్యాదు చేయడంతో భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు.. ఈ కేసులో భాగంగానే పీటీ వారెంట్‌పై కర్నూలు జిల్లా నుంచి విజయవాడకు తీసుకొచ్చారు.. అయితే, పోసాని కృష్ణ మురళికి ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించింది సీఎంఎం కోర్టు..

Exit mobile version