Site icon NTV Telugu

Auto Bandh: రేపు ఆటోల బంద్‌కు JAC పిలుపు..

Auto Bandh

Auto Bandh

Auto Bandh: విజయవాడ నగరంలో రేపు అనగ గురువారం రోజు ఆటోలు బంద్ నిర్వహించనున్నట్లు ఆటో జేఏసీ ప్రకటించింది. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. జీవో నంబర్ 21తో పాటు BNS 106 (1), (2)లను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిబంధనల వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

Read Also: Beetroot Face Mask: మీ ముఖం గులాబీ రంగులో మెరిసిపోతుంది.. హోం మేడ్ బీట్‌రూట్ ఫేస్ మాస్క్‌ ట్రై చేయండి..

మరోవైపు.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన “స్త్రీశక్తి” స్కీమ్‌.. అమలు కారణంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటోందని ఆరోపిస్తూ, నష్టపోయిన ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.25,000 నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ఇక, ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ యాప్‌లకు బదులుగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక యాప్‌ను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. దీని ద్వారా మధ్యవర్తుల దోపిడీ తగ్గి డ్రైవర్లకు నేరుగా లాభం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు.

Exit mobile version