Vijayasai Reddy PRP Party: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. పార్టీకి ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (పీఆర్పీ) అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ పేరు, జెండాను ఆయన అధికారికంగా ఆవిష్కరించారు. బెజవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల మధ్య కొత్త పార్టీ పేరు, జెండాను బటన్ నొక్కి ఆవిష్కరించారు సాయిరెడ్డి..
తెలుపు, కాషాయ రంగుల్లో పార్టీ జెండా
కొత్తగా ప్రకటించిన పరివర్తన రాజనీతి పార్టీ జెండాను తెలుపు, కాషాయ రంగులతో రూపొందించారు. జెండా మధ్యలో ధర్మ చక్రం గుర్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి పార్టీ పేరును, జెండాను ప్రజలకు పరిచయం చేశారు. అయితే, విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు రాజకీయ పార్టీలు క్రియాశీలకంగా ఉన్న నేపథ్యంలో పరివర్తన రాజనీతి పార్టీ ఎలాంటి రాజకీయ కార్యాచరణతో ముందుకు వెళ్తుందనే చర్చ మొదలైంది. పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలు, భవిష్యత్తు కార్యాచరణ, రాజకీయ లక్ష్యాలపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది. కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. రాజ్యసభ సభ్వాన్నికి కూడా రాజీనామా చేశారు.. ఆ తర్వాత కొంత కాలం సైలెంట్‌గా ఉండి పార్టీ పెడతానని చెబుతూ వచ్చారు.. ఈ రోజు పార్టీ పేరును కూడా ప్రకటించారు..

