Vallabhaneni Vamsi Case: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగిలింది.. వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం.. వంశీ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20వ తేదీన తుది విచారణ చేపడతామని పేర్కొంది.. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ. ఈ కేసు దర్యాప్తు దశలో ఉందని వంశీకి బెయిల్ మంజూరు చేయవద్దని ప్రభుత్వ తరఫు న్యాయవాది.. న్యాయమూర్తికి విన్నవించారు.. కిడ్నాప్ కేసులో కీలక ఆధారాలు ఉన్నాయని.. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయవద్దని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరారు.. దీంతో, తదుపరి విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి..
Read Also: Minister Seethakka: బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ.. బీఆర్ఎస్ ముదిరాజ్లకు టికెట్ ఇవ్వలేదు..
మరోవైపు.. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ముగియడంతో వల్లభనేని వంశీ మోహన్‌ని వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.. వంశీ రిమాండ్‌ను ఈ నెల 28వ తేదీ వరకు పొడిగించింది కోర్టు.. వంశీ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 20వ తేదీన తుది విచారణ చేపట్టనున్నరట్టు ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది.. దీంతో, ఇటు రిమాండ్ ఈ నెల 28వ తేదీ వరకు పొడిగించడం.. మరోవైపు.. బెయిల్ పిటిషన్‌పై విచారణ కూడా వాయిదా పడడంతో.. వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగిలినట్టు అయ్యింది..