NTV Telugu Site icon

Traffic Restrictions: వాహనదారులకు హెచ్చరిక.. రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు..

Traffic Restrictions

Traffic Restrictions

Vijayawada: రేపు విజయవాడ బందర్ రోడ్డులో సామాజిక న్యాయ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ప్రారంభోత్సవ సభ ఉండటంతో పాటు అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా వాహనాల ట్రాఫిక్ మళ్లింపు కొనసాగుతుందని విజయవాడ ట్రాఫిక్ డీసీపీ కే. చక్రవర్తి తెలిపారు. రేపు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. నగరం వెలుపల నుంచే భారీ, మధ్య తరహా రవాణా వాహనాల రాకపోకలు కొనసాగించాలని చెప్పారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం.. విశాఖ నుంచి హైదరాబాద్ కు వాహనాల రాకపోకలను ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి జి.కొండూరు, నూజివీడు, హనుమాన్ జంక్షన్ వైపుగా మళ్లిస్తామని డీసీపీ పేర్కొన్నారు.

Read Also: Blood Preassure in Winter: చలికాలంలో బీపీ పెరగకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..

ఇక, విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ బైపాస్ మీదుగా గుడివాడ, పామర్రు, చీరాల, ఒంగోలు జిల్లా మీదుగా మళ్లిస్తామని ట్రాఫిక్ డీసీపీ చక్రవర్తి తెలిపారు. అలాగే, రేపు విజయవాడలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుల రాకపోకలను మళ్లిస్తున్నామని చెప్పారు. సభ కోసం వాహనాలలో వచ్చే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బెంజ్ సర్కిల్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు సభకు పర్మిషన్ ఉన్న వెహికిల్స్ మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సభకు సుమారు 1 లక్ష 30 వేల మంది వచ్చే అవకాశం ఉంది.. రాష్ట్రవ్యాప్తంగా 2,600 బస్సులు, 2000 వేలకు పైగా కార్ల కోసం పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని ట్రాఫిక్ డీసీపీ కే. చక్రవర్తి వెల్లడించారు.