Terror Links Case: టెర్రర్ లింక్స్ కేసులో మరో అరెస్ట్.. విజయవాడ 2 టౌన్ పీఎస్‌లో విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terror Links Case: తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ లింక్స్ కేసు కలకలం రేపుతోంది.. పోలీసులు మరో కీలక అరెస్ట్ చేశారు. ఈ కేసులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని చంచల్‌గూడాకు చెందిన సయీదా బేగంను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను విచారణ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం, విదేశీ హ్యాండ్లర్ అల్ హకీమ్ షుకూర్ సూచనలతో సయీదా బేగం పనిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోహైల్ బెగ్, షరీఫ్, డానిష్ వంటి యువకులను తీవ్రవాద సంస్థల వైపు మళ్లించడంలో ఆమె కీలక పాత్ర పోషించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
Also Read
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
- Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
- Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
ప్రస్తుతం సయీదా బేగంను విజయవాడలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక, ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని మల్లేపల్లి ప్రాంతానికి చెందిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సోషల్ మీడియా ద్వారా తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడం, దేశ వ్యతిరేక పోస్టులు చేయించడం వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసుల దర్యాప్తులో దేశవ్యాప్తంగా సుమారు 42 మందితో కూడిన నెట్‌వర్క్ ఏర్పాటుచేసినట్లు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ గ్రూప్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన యువకులు ఉన్నట్లు సమాచారం. సోషల్ మీడియా వేదికల ద్వారా తీవ్రవాద ప్రచారం నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును పోలీసులు అత్యంత కీలకంగా తీసుకుని దర్యాప్తును మరింత విస్తరించారు. దేశ భద్రతకు ముప్పుగా మారే అవకాశాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
OPPO Reno 16T లాంచ్.. 200MP కెమెరా, 6700mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!