Alapati Rajendra Prasad: విజయవాడలో చానాళ్లుగా ఉన్న శాతవాహన కళాశాల వివాదం వ్యవహారం మరో మలుపు తిరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ తనకు టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో ప్రాణహాణి ఉందని తనను ఆలపాటి బెదిరిస్తున్నారని రక్షణ కల్పించాలని విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా.. తాజా పరిణామాలపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.. కీలక వ్యాఖ్యలు చేశారు.. శాతవాహన కాలేజీ ప్రారంభించి 53 యేళ్లు అయ్యింది.. అనేకమంది పెద్దలు సెక్రటరీ లుగా పని చేశారు.. 2011లో నేను సెక్రటరీగా అయిన సమయంలో ఈ ఆస్తిని లోక్ అదాలత్ లో పెట్టినట్లు వంకాయలపాటి కామేశ్వరరావు, బోయపాటి అప్పారావు మధ్య వివాదం నడిచింది.. ఆ తరువాత ఈ వివాదం సుప్రీంకోర్టు వరకూ కూడా వెళ్లింది.. ఆ తర్వాత శ్రీనివాసరావు, ప్రజాప్రతిరావులు కోర్టులో గెలిచి కూడా పిటిషన్ వెనక్కి తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది.. ఆ తరువాత కళాశాలను అర్ధరాత్రి పడగొట్టారని.. రిట్ పిటిషన్ లు విత్ డ్రా చేశారని ప్రజాప్రతిరావు కోర్టు ను ఆశ్రయించారు.. వంకాయలపాటి శ్రీనివాసరావు టెంపరరీ ప్రిన్సిపాల్ గా ఉంటూ రికార్డులు బయటకు ఇచ్చారు.. దీనిపై రావాలని నేను కోరినా ఆయన రాలేదు.. ఫోన్ లో ఎందుకు రాలేదని ప్రశ్నిస్తే.. నేను బెదిరించానని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు ఆలపాటి.
Read Also: Anchor Ravi : బిగ్ బాస్ కు వెళ్తే నాశనమే.. యాంకర్ రవి సంచలనం..
ఇక, అసలు ఈ ఆస్తి ఎవరిది… ఎవరు లాక్కుంటున్నారో అందరూ ఆలోచన చేయాలి.. బోయపాటి కుటుంబ సభ్యులు వాటా అమ్ముకుని… మళ్లీ తమదేనని ఎలా వచ్చారు? శాతవాహన కళాశాల నడపాలన్నదే మా ఉద్దేశం అని స్పష్టం చేశారు ఆలపాటి రాజేంద్రప్రసాద్.. ఈ నెల 12న సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్నందునే ఇప్పుడు వంకాయలపాటి శ్రీనివాసరావు కొత్త డ్రామా ఆడుతున్నారు.. అసలు తాత్కాలిక ప్రిన్సిపాల్ గా ఉన్న శ్రీనివాసరావుకు ఈ వివాదంతో సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు.. పద్దతి మార్చుకో… తప్పు చేయకు అని చెబితే… బెదిరింపులు అంటారా? అని మండిపడ్డారు.. సేల్ ఆఫ్ అగ్రిమెంట్ లు కూడా వేరే వారికి అమ్మేశారు.. ఈ వివాదం లో పోలీసులు కు చిత్తశుద్ధి ఉంటే శ్రీనివాసరావు ను అరెస్టు చేయాలి.. రిట్ పిటిషన్ లో కూడా పోలీసులు కౌంటర్ వేయమనిచెప్పినా వారు వేయలేదు.. చంపుతారు, భయపెట్టారు అని బురద జల్లి తప్పుకోవాలని చూస్తున్నారు.. దీని పై ఎవరితో అయినా చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం అని సవాల్ చేశారు టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్.
Read Also: Mukesh Ambani’s Salary: అపర కుబేరుడి సాలరీ సున్నా.. ఐదేళ్లుగా రూపాయి తీసుకొని ముఖేష్.. కానీ!
కాగా, ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ తనకు టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో ప్రాణహాణి ఉందని.. రక్షణ కల్పించాలని విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. 2 నెలల క్రితం తనను ఆలపాటి అనుచరులు కళాశాల విషయంలో కిడ్నాప్ చేశారని.. ఆ సమయంలో పోలీసులకు తన కుమారుడు ఫిర్యాదు చేస్తే అర్థరాత్రి సమయంలో విడుదల చేశారని తెలిపారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఆలపాటి తనను ఫోనులో బెదిరిస్తున్నారని వంకాయలపాటి సీపీకి ఫిర్యాదు చేసిన తర్వాత మీడియాకు తెలిపారు. శాతవాహన కళాశాల విషయంలో తన మాట వినాలని లేకపోతే తనను చంపేస్తానని ఆలపాటి బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై డీజీపీకి కూడా ఫోన్ కాల్ ఆడియోను కూడా జత చేసి ఫిర్యాదు చేసినట్టు వంకాయలపాటి తెలిపారు. తన ఫ్యామిలీని గతంలో చంపేస్తానని బెదిరించారని ఇప్పుడు తన సంగతి తేలుస్తా అని బెదిరిస్తున్నారని తెలిపారు. తన ఫోన్ కూడా సీఐడీ వారితో ట్యాపింగ్ చేయిస్తున్నానని చెప్పారని, తనకు పోలీసులు రక్షణ కల్పించాలని సీపీని కలిసినట్టు తెలిపారు.
Read Also: Ghati-Mirai-The Girlfriend : అనుష్క, తేజసజ్జ మధ్య భీకర పోటీ.. రష్మిక నిలబడుతుందా..?
ఆలపాటికి అసలు కళాశాలతో సంబంధంలేకపోయినా కావాలని తనను ఇబ్బంది పెడుతున్నారని, సీఎం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్ళినట్టు ఫోన్ లో ఆలపాటి అంటున్నారని.. ఆలపాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తర్వాత ఆలపాటి ఫోన్ కాల్ ఆడియోను మీడియాకు విడుదల చేశారు. తనకు ఏం జరిగినా ఆలపాటిదే బాద్యతన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా స్పందించారు. శాతవాహన కళాశాలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తాను వంకాయలపాటిని ప్రిన్సిపల్ గా తొలగించాలని కరస్పాండెంట్ కు చెబితే ఆయన వద్దని వారించి శ్రీనివాస్ ను తన దగ్గరకు తీసుకువస్తానని చెప్పారని శ్రీనివాస్ రాకపోతే తాను ఫోన్ చేసిన మాట వాస్తవమన్నారు. అయితే తాను చంపేస్తానని బెదిరించలేదని కేవలం చట్టపరంగా చర్యలు తీసుకుంటానని తెలిపానన్నారు. పోలీసులు సరిగా స్పందించటంలేదని శ్రీనివాసరావును పోలీసులు చిత్తశుద్దితో వ్యవహరించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. కళాశాల నడపాలని తాను ప్రయత్నిస్తున్నానని ప్రిన్సిపల్ గా ఉన్న శ్రీనివాసరావు వేరే వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు.
