Site icon NTV Telugu

Satavahana College Controversy: శాతవాహన కళాశాల వివాదం.. రూ.200 కోట్ల విలువైన ఆస్తిని కాపాడండి..!

Satavahana College Controve

Satavahana College Controve

Satavahana College Controversy: విజయవాడ శాతవాహన కళాశాలను వివాదాలు వీడడం లేదు. వారం క్రితం కాలేజీ ప్రిన్సిపాల్‌ కిడ్నాప్‌తో… ఒక్క సారిగా కలకలం రేగింది. తాజాగా, కాలేజీ భవనాల కూల్చివేత ఆందోళనకు దారితీసింది. ఇరు పక్షాలు పరస్పరం కేసులు పెట్టుకున్నాయి. కాలేజీ భూముల విషయంలో బోయపాటి శ్రీనివాస్‌, వంకాయలపాటి మధ్య సుప్రీం కోర్టులో వివాదం నడుస్తుంది. ఈ నెల 3న కోర్టు ఆదేశాల ఇచ్చిందని బోయపాటి కుటుంబానికి చెందిన శ్రీకృష్ణ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు తమ భూమి స్వాధీనం చేసుకున్నామన్నారు శ్రీకృష్ణ. కాలేజీ రికార్డులు అన్నీ సొసైటీ వాళ్ల దగ్గరే ఉన్నాయన్నారు. ఖాళీ చేయించే ముందు అన్ని విషయాలు సొసైటీకి చెప్పామన్నారు బోయపాటి శ్రీకృష్ణ.

Read Also: Double Murder Case: అజ్ఞాతంలోకి పిన్నెల్లి బ్రదర్స్‌..? డబుల్‌ మర్డర్ కేసులో పోలీసుల గాలింపు..

కాలేజీ ప్రిన్సిపాల్‌ వంకాయలపాటి శ్రీనివాస్‌ కూడా కాలేజీ రికార్డులు తమ వద్ద ఉన్నట్టు అంగీకరించారు. అయితే, మాజీ ప్రిన్సిపాల్‌ సాంబి రెడ్డి మాత్రం కాలేజీ భవనాల కూల్చివేతను తప్పుబట్టారు. విద్యార్థుల భవిష్యత్‌ దెబ్బతినేలా వ్యవహరించడం సరికాదన్నారు. మరోవైపు సొసైటీ భూమిలోకి అక్రమంగా ప్రవేశించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు TDP MLC ఆలపాటి రాజేంద్రప్రసాద్‌. మరోవైపు… శాతవాహన కాలేజీ వ్యవహారంలో సుప్రీం కోర్టులో తాను వేసిన పిటిషన్‌ ఉపసంహరించుకోలేదన్నారు సొసైటీ వ్యవస్థాపకుల్లో ఒరైన ప్రజాపతి రావు. తన సంతకాన్ని పోర్జరీ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read Also: Story board: తెలుగు రాష్ట్రాల ఆర్థిక స్థితి ఏంటి? ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువ? హామీల సంగతేంటి?

ఇక, శాతవాహన కళాశాల ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు.. కీలక వ్యాఖ్యలు చేశారు.. శాతవాహన కళాశాలను రాత్రికి రాత్రి కూల్చేశారు.. ప్రభుత్వ అండతో కబ్జా ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ప్రభుత్వ పెద్దల అండతో ఇదంతా చేస్తున్నారని దుయ్యబట్టారు.. 200 కోట్ల విలువైన ఆస్తిని ప్రభుత్వం కాపాడాలని డిమాండ్‌ చేశారు.. ఎమ్మెల్సీ ఆలపాటి పై కిడ్నాప్ ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు.. విద్యార్ధుల భవిష్యత్ అంధకారంలో పడింది అని ఆవేదన వ్యక్తం చేశారు.. విద్యాశాఖ మంత్రి ఈ అంశంపై స్పందించాలి.. ప్రభుత్వం వెంటనే ఈ వివాదంపై స్పందించాలి.. SRR కళాశాల స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. కనకదుర్గ థియేటర్ ను కూడా బుల్డోజర్ తో పగలకొట్టారు.. బుల్డోజర్ సంస్కృతి రాష్ట్రంలో నడుస్తోందని ఫైర్‌ అయ్యారు సీపీఎం నేత బాబూరావు..

Exit mobile version