Saikrishna Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించి సాయికృష్ణ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు దూకుడు పెంచారు.. సాయికృష్ణ కేసులో సీబీఐ విచారణ అర్ధరాత్రి వరకు కొనసాగింది. విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సుమారు ఆరు గంటల పాటు సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన సాక్షులను విచారించడంతో పాటు, దర్యాప్తు వివరాలపై ఆరా తీశారు.
కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారుల నుంచి కూడా కీలక వివరాలను సేకరించినట్లు సమాచారం. కేసుకు సంబంధించిన వివిధ అంశాలపై సీబీఐ అధికారులు విచారణ కొనసాగించారు. రాత్రి 12 గంటలు దాటిన తర్వాత సీబీఐ అధికారులు కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. సాయికృష్ణ కేసులో దర్యాప్తును కొనసాగించనున్న అధికారులు, ఇవాళ కూడా విచారణ చేపట్టనున్నారు. దీంతో ఈ కేసులో తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది.

