PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PVN Madhav: ఆంధ్రప్రదేశ్‌లో సెక్షన్ 22-A పరిధిలో ఉన్న అర్హత కలిగిన భూములపై నిషేధాన్ని తొలగించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. అర్హత కలిగిన ప్రైవేట్, ఫ్రీహోల్డ్ భూములను తక్షణమే 22-A జాబితా నుంచి తొలగించి, వాటి యజమానులకు రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని ఆయన కోరారు. ఒకే సర్వే నంబర్‌కు సంబంధించి ఉన్న డూప్లికేట్, పాత లేదా ఆధారాలు లేని 22-A ఎంట్రీలను తొలగించాలని మాధవ్ సూచించారు. ఏదైనా భూమిని 22-A జాబితాలో ఎందుకు చేర్చారు, అందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వు, గెజిట్ లేదా ఇతర రికార్డు ఏమిటనే వివరాలను భూ యజమానులకు పారదర్శకంగా తెలియజేసే ఆన్లైన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కోరారు.
అర్హత లేని భూములు 22-A జాబితాలో కొనసాగకుండా స్పష్టమైన పరిశీలనా విధానాన్ని అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. 22-A నుంచి భూమిని తొలగించేందుకు వచ్చే దరఖాస్తులపై విచారణ, నిర్ణయం, అప్పీల్ ప్రక్రియకు స్పష్టమైన కాలపరిమితిని నిర్ణయించాలని సూచించారు. ధృవీకరణ పూర్తయి, చట్టపరంగా రిజిస్ట్రేషన్‌కు అర్హత కలిగిన భూములకు రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరారు.
Also Read
- Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
- Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
- Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
అలాగే జిల్లా వారీగా 22-A జాబితా నుంచి తొలగించిన భూముల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని మాధవ్ కోరారు. దీనివల్ల రైతులు, భూ యజమానుల్లో ఉన్న అనిశ్చితి తొలగుతుందని పేర్కొన్నారు. భూమి యాజమాన్యానికి సంబంధించిన వివరాల్లో పారదర్శకత పెరగడంతో పాటు, అర్హులైన భూ యజమానులకు తమ ఆస్తిపై హక్కులను వినియోగించుకునే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన లేఖలో వివరించారు. రైతుల భూమి వారి ఆర్థిక భద్రతకు, కుటుంబ అవసరాలకు, భవిష్యత్ తరాలకు అత్యంత ముఖ్యమైన ఆస్తి అని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. అందువల్ల అర్హత కలిగిన భూములను 22-A నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబును కోరారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్..
తాజావార్తలు
-
PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
-
Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
-
Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!