NTV Telugu Site icon

Vijayawada Floods: వరద సహాయక చర్యల్లో పోలీస్‌ కమిషనర్‌.. 10 రోజుల పసి పాపను కాపాడిన సీపీ..

Vja Cp

Vja Cp

Vijayawada Floods: విజయవాడలోని చాలా ప్రాంతాలు ఇంకా వరదనీటిలోనే మగ్గుతున్నాయి.. సీఎం చంద్రబాబు నాయుడు నుంచి.. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ప్రజా ప్రతినిధులు.. ఐఏఎస్‌లు.. ఐపీఎస్‌లు.. ఇతర పోలీసు సిబ్బంది.. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది.. ఇలా అంతా వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.. ఇక, 10 రోజుల పసి పాపను స్వయంగా రక్షించి పునరావాసా కేంద్రానికి తరలించారు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర్ బాబు..

Read Also: AI: ఏఐ వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారా?

ఎన్టీఆర్‌ పోలీస్ కమీషనరేట్ పరిధిలో సీపీ రాజశేఖర్‌ బాబు.. వరద ఉధృతిని పర్యవేక్షిస్తూ.. ఎన్డీఆర్‌ఎఫ్‌ మరియు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఫైర్ మరియు పోలీసు లా అండ్ ఆర్డర్ అధికారులు.. సిబ్బంది సహకారంతో లోతట్టు ప్రాంతాలలో సహాయక చర్యలతో నీట మునిగిన ప్రాంతాల నుండి ప్రజలను రక్షించి పునరావాసాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.. ఈ క్రమంలో రెండవ రోజు సింగ్ నగర్, నున్న పరిసర ప్రాంతాలు ఇబ్రహీంపట్నం ఏరియాలలోని నీట మునిగిన ప్రాంతాల్లోకి స్వయంగా వెళ్లి క్షేత్రస్థాయిలో అధికారులకు సూచనలిస్తూ .. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ క్రమంలో వరదలో చిక్కుకున్న 10నెలల బాలికను.. వారి కుటుంబ సభ్యులను బోట్ సహాయంతో స్వయంగా బయటకు తీసుకువచ్చారు.. వృద్దులను, మహిళలను స్వయంగా రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించారు.. భవానీపురం, చిట్టీనగర్ మరియు వై.ఎస్.ఆర్ కాలనీ ఏరియాలలోని నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించి.. వారికి అందుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకుని అధికారులకు తగు సూచనలు చేశారు సీపీ రాజశేఖర్‌ బాబు..