Site icon NTV Telugu

Rs. 99 Liquor Bottles: రూ.99 లిక్కర్‌ కోసం ఎదురుచూపులు..!

99 Liquor

99 Liquor

Rs. 99 Liquor Bottles: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత… ప్రభుత్వ మద్యం షాపులకు గుడ్‌బై చెప్పేసి.. మళ్లీ ప్రైవేట్‌ లిక్కర్‌ షాపులు ఏర్పాటు చేశారు.. టెండర్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం కూడా వచ్చింది.. అయితే, తమ ప్రభుత్వంలో రూ.99కే నాణ్యమైన మద్యం అందిస్తామంటూ సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం విదితమే కాగా.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త లిక్కర్‌ షాపులు ప్రారంభం అయినా.. మద్యం దుకాణాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు 99 రూపాయల క్వార్టర్ బాటిల్.. ఏపీ ప్రభుత్వం క్వార్టర్ రూ.99కి అందిస్తామని చెప్పిన నేపథ్యంలో డిపోలకు చేరాయి షాట్ విస్కీ, ఓల్డ్ క్లబ్ బ్రాందీ.. కానీ, డిపోల నుంచి ఇంకా అత్యధిక షాపులకు రూ.99 క్వార్టర్ బాటిల్స్ చేరలేదు.. కొన్నింటికి మాత్రమే రూ.99 క్వార్టర్‌ బాటిల్స్‌ చేరాయి.. తక్కువ ధరకే దొరికే ఈ క్వార్టర్‌ బాటిల్స్‌తో పాటు.. గత ప్రభుత్వంలో మాయమైన వివిధ బ్రాండ్స్‌ లిక్కర్‌ కూడా అందుబాటులోకి వచ్చింది..

Read Also: Ex Minister Harish Rao: మాజీ మంత్రి బంధువులపై చీటింగ్‌ కేసు నమోదు..

అయితే, వైసీపీ ప్రభుత్వ హయాంలో క్వార్టర్ బాటిల్ ప్రారంభ ధర 120 రూపాయలుగా ఉండా.. కూటమి ప్రభుత్వంలో రాడికో, ప్రేడ్ డిస్టలరీస్ నుంచి 99 రూపాయల మద్యం సరఫరా చేస్తున్నారు.. గురువారం 10 వేల కేసుల 99 రూపాయల క్వార్టర్ బాటిల్ స్టాక్‌ డిపోలకు సరఫరా చేసినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది.. ఇక, సోమవారం నాటికి 25 వేల కేసుల స్టాకు పంపటానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెబుతున్నారు.. అంటే.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని లిక్కర్‌ షాపుల్లో రూ.99 క్వార్టర్ బాటిళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.

Exit mobile version