Nellore Lady Don: నెల్లూరు జిల్లాకు చెందిన లేడీ డాన్ అరుణ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఒంగోలు జిల్లా జైల్లో ఉన్న ఆమెను పీటీ వారెంట్ పై విజయవాడ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. అయితే, కోర్టు పరిసరాల్లో ఊహించని విధంగా హడావుడి సృష్టించింది. ఆమెపై ఫిర్యాదు చేసిన వ్యక్తి రమేష్ కోర్టు బయట కనిపించడంతో, ఆగ్రహంతో అరుస్తూ, బెదిరింపులకు దిగింది ఈ లేడీ డాన్. నీ సంగతి చూస్తానంటూ రమేష్‌పై దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
Read Also: Visakhapatnam: లైంగిక వేధింపులతో డిగ్రీ స్టూడెంట్ మృతి.. విద్యార్థి సంఘాల ఆందోళన
ఇక, వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రమేష్ నుంచి అరుణ రూ.24. 50 లక్షలను రెండు విడతలుగా తీసుకుంది. కానీ, ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని రమేష్ డిమాండ్ చేశాడు. లేడీ డాన్ అరుణ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ కేసులో అరుణను పీటీ వారెంట్ పై కోర్టుకు తీసుకువచ్చారు. అయితే, న్యాయస్థానం బయట ఆమె ప్రవర్తించిన తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని మళ్లీ జైలుకు తీసుకెళ్లారు.
