NTV Telugu Site icon

Vijayawada: వరద ముంపు నుంచి తేరుకొని బెజవాడ.. రంగంలోకి నేవీ హెలికాప్టర్..

Vja

Vja

Vijayawada: వరద ముంపు నుంచి ఇంకా విజయవాడ నగరం తేరుకోలేదు. నగర శివారు ప్రాంతాలను కూడా బుడమేరు వాగు ప్రవాహం వదలి పెట్టలేదు. నున్న , గన్నవరం, సింగ్ నగర్ వెళ్ళే మార్గాలకు కనెక్టివిటీ కట్ అయింది. శివారు ప్రాంతాల్లో ఉన్న వందల ఎకరాలు ఖాలీ స్థలాలు, అపార్ట్ మెంట్లు ఇంకా నీటిలోనే మునిగిపోయాయి. మరోవైపు ఆగని వర్షంతో ప్రజలు, రెస్య్కూ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్ వచ్చి కాపాడాలని బాధితులు కోరుతున్నారు. అయితే, విజయవాడలో వరదలకు చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించేందుకు అధికారుల సన్నాహాలు చేస్తున్నారు. సింగ్ నగర్ నుంచి పడవలను తరలించి అక్కడ నుంచి ఇందిరా నాయక్ నగర్, రాజరాజేశ్వరరావుపేట తదితర ప్రాంతాల్లో వరద ప్రవాహంలో చిక్కుకున్న వారిని పడవల సాయంతో బయటకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Also: Dwayne Bravo Retirement: రిటైర్మెంట్‌ ప్రకటించిన విండీస్‌ దిగ్గజం డ్వేన్‌ బ్రావో!

ఇక, బుడమేరు వంతెన వద్దకు లారీల్లో భారీగా పడవలు చేరుకున్నాయి. సహాయక చర్యల కోసం రాష్ట్రానికి కేంద్రం పంపిన పవర్ బోట్లు, హెలికాప్టర్లు సైతం వచ్చాయి. మొత్తం 40 పవర్ బోట్లతో పాటు 6 హెలికాప్టర్లు అందుబాటులోకి వచ్చాయి. రంగంలోకి అదనంగా మరో 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరాయి. బెజవాడలో నేవీ హెలీకాప్టర్ సైతం రంగంలోకి దిగింది. హెలికాప్టర్ ద్వారా గోడౌన్స్ లో ఉన్న వారిని రక్షిస్తున్నారు. తాడు సహాయంతో హెలికాప్టర్ ద్వారా వరద నీటిలో చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు రెస్క్యూ టీమ్.. సుమారు 20 నిమిషాలు పాటు గోడౌన్ లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకు వస్తున్నారు. హెలికాప్టర్, బోట్స్ ద్వారా మాత్రమే సహాయక చర్యలు చేయాల్సిన పరిస్థితి ఏర్పాడింది.

Show comments