NTV Telugu Site icon

Nara Bhuvaneshwari: ఫిబ్రవరి 15న ఎన్టీఆర్‌ ట్రస్ట్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్..

Nara Bhuvaneshwari

Nara Bhuvaneshwari

విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఈవెంట్ కోసం జరుగుతున్న ఏర్పాట్లను సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పరిశీలించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్న ఈవెంట్ కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. ఫిబ్రవరి 15న నిర్వహించే కార్యక్రమం కోసం ఏర్పాట్లపై భువనేశ్వరి పోలీసులతో చర్చించారు. స్టేడియంలో నిర్మాణం చేసే బ్లాక్‌లు, వీవీఐపీలకు మార్గం, ప్రజలు వచ్చే మార్గాలను పోలీసు కమీషనర్ రాజశేఖర్ బాబు భువనేశ్వరికి వివరించారు. పాస్‌లు ఉన్న వారినే లోపలకు అనుమతి ఉండేలా చర్యలు తీసుకోవాలని సీపీకి భువనేశ్వరి సూచించారు.

Read Also: HYDRA : అమీన్‌పూర్ మున్సిపాలిటీలో స‌మ‌గ్ర స‌ర్వేకు సిద్ధమైన హైడ్రా..

ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ మెమోరియల్ ట్రస్ట్ ఇప్టోరియా మ్యూజిక్ నైట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సంగీత దర్శకుడు తమన్ పాల్గొంటారని చెప్పారు. ఈ మ్యూజికల్ నైట్‌ను వీక్షించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి అందరూ రావాలని కోరుతున్నానని పేర్కొన్నారు. మీరు కొనే టిక్కెట్ డబ్బుతో తలసేమియాతో బాధ పడే వారికి సహకారం అందిస్తాం.. సోషల్ కాజ్‌తో ఐదు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం.. ఒక్క సెంటర్ ఏర్పాటుకి 60 లక్షలు ఖర్చు అవుతుందని భువనేశ్వరి తెలిపారు. వారికి మందులు, రక్తం వంటి వాటికి చాలా ఖర్చు అవుతుంది.. ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ మీట్, మందులు ఇప్పటికే ఇస్తున్నామని అన్నారు. ఇది ఒక మంచి ఉద్దేశంతో చేసే కార్యక్రమం.. అందరూ తమ ఆపన్న హస్తం అందిస్తారని ఆశిస్తున్నానని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

Read Also: Acer Aspire 3: రూ. 50 వేల ల్యాప్ టాప్ రూ. 30 వేలకే.. లేట్ చేయకండి