Site icon NTV Telugu

MP Mithun Reddy: నేడు లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ముందుకు ఎంపీ మిథున్ రెడ్డి

Mithun Reddy

Mithun Reddy

MP Mithun Reddy: గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇవాళ (జూలై 19న) సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఆయన 10 గంటలకు విజయవాడలోని సిట్ ఆఫీసుకు వెళ్లనున్నట్లుగా సమాచారం. విచారణ తర్వాత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని సిట్ కోరగా.. అందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది.

Read Also: Pakistan: భారత విమానాలకు గగనతల నిషేధం పొడిగింపు.. ఎప్పటివరకంటే..!

అయితే, కేసు ఛార్జిషీటులో ఎంపీ మిథున్ రెడ్డి పేరును చేర్చడంతో ఆయన ఏపీ హైకోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా.. విచారణ చేపట్టి ధర్మాసనం.. కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు వ్యక్తిని అరెస్ట్ చేయకుండా కేసులో ఛార్జ్‌షీట్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

Exit mobile version