AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది.. ఈ కేసులో కొత్తగా నిందితుల పేర్లు సిట్ చేర్చనుందా అనే చర్చ మొదలైంది. గత 15 రోజుల కాలంలో సిట్ విచారణలో భాగంగా సేకరించిన ఆధారాలు సహాయంతో మరికొందరి పేర్లు కేసులో చేర్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి 48 మంది మీద కేసు నమోదు అయింది. ఇందులో 29 మంది వ్యక్తులు 19 సంస్థలు ఉన్నాయి. కేసులో నిందితులుగా ఉన్న వారిలో 12 మందిని సీట్ అరెస్టు చేయగా.. అందులో నలుగురు బెయిల్ పై విడుదలయ్యారు. ఇంకా ఎనిమిది మంది రిమాండ్‌లో కొనసాగుతున్నారు. ఇదే సమయంలో మరి కొంతమంది అరెస్టులు చేసేందుకు సిట్ సిద్ధం అవుతోంది అని ప్రచారం జరిగినా అది జరగలేదు. అయితే, కేసు విచారణ తుది దశకు వచ్చింది అని చిట్ అధికారులు చెబుతున్న నేపథ్యంలో విశాఖ, తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాల్లో వరసగా చేపట్టిన సోదాలు కొత్త నిందితుల పేర్లు చేరనున్నాయి అనే అంశానికి బలాన్ని చేకూరుస్తున్నాయి.
Read Also: Brahmanandam : పొలిటికల్ ఎంట్రీపై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
ఈ కేసుకు సంబంధించి చిత్తూరులో వైసీపీ నేతగా ఉన్న విజయానంద రెడ్డిని ఇప్పటికే పోలీసులు విజయవాడ సిట్ కార్యాలయానికి పిలిపించి విచారించారు. మద్యం స్కాం కేసుకి సంబంధించి లిక్కర్ సరఫరా వ్యవహారాలు అన్ని చక్కబెట్టినట్టుగా విజయానంద రెడ్డి మీద వచ్చిన ఫిర్యాదుల అంశంగా కేసులో ఇతని పాత్ర ఎంతవరకు ఉందనే అంశంపై సిట్ విచారణ చేపట్టింది. మరోవైపు జగన్ సోదరుడు అనిల్ రెడ్డి పీఏ దేవరాజులును కూడా సెట్ అధికారులు విచారించారు. ఇంకోవైపు సునీల్ రెడ్డి పాత్ర ఉంది అనే దాని మీద కూడా విస్తృత ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో విశాఖలో హైదరాబాద్‌లో చేపట్టిన సోదలలో కూడా కొని కీలక ఆధారాలు సిట్ సేకరించిందని ఈ ఆధారాల సహాయంతో మరికొందరిపై కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఇక చెవిరెడ్డి సన్నిహితులు చెవిరెడ్డికి సంబంధించిన కార్యాలయాల్లో చేపట్టిన సోదాలు కూడా చర్చగా మారాయి. అయితే, కొత్తగా నిందితుల పేర్లను కేసులో చేర్చే అంశంపై సిట్ మాత్రం గుంభనంగా వ్యవహరిస్తోంది. ఇటీవల కేసుకు సంబంధించి వరస షాకులు సిట్‌కి తగలడంతో ప్రతి విషయంపై లీకులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పడకుండా విచారణ చేపడతున్న సిట్ ఏం చేయబోతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది..
