Site icon NTV Telugu

Minister Satya Kumar Yadav: ప్రపంచమంతా మళ్లీ భారతీయ వైద్య విధానం వైపు..

Minister Satya Kumar Yadav

Minister Satya Kumar Yadav

Minister Satya Kumar Yadav: ప్రపంచమంతా మరలా భారతీయ వైద్య విధానం వైపు చూస్తుందన్నారు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్.. విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఆయూష్ డాక్టర్ల ఆత్మీయ సన్మానంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఆయుష్ డాక్టర్ల స్టైఫండ్ ను పెంచిన ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.. ప్రపంచమంతా మరలా భారతీయ వైద్య విధానం వైపు వస్తోందని.. ఆయుష్ కు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారని పేర్కొన్నారు.. 2.5 కోట్ల మంది మన రాష్ట్రంలో ఒకేరోజు యోగా చేసేలా ఏపీ ప్రభుత్వం చేసింది.. విజయవాడ ఆయుర్వేద కాలేజీ అభివృద్ధికి 3 కోట్లు ఇచ్చాం.. కాకినాడ, విశాఖలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులు సిద్ధం చేస్తున్నాం అన్నారు సత్యకుమార్‌..

Read Also: Hydra: బంజారాహిల్స్‌లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా.. రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి సేఫ్..

ఇక, 2021 నుంచి 2024 వరకు మూడు ఆర్ధిక సంవత్సరాలు ఆయుష్ నిధులకు ప్రతిపాదనలే పంపలేదు అని గత ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు సత్యకుమార్‌ యాదవ్.. ధర్మవరంలో కొత్త ఆయుష్ కాలేజీ రాబోతోంది.. 34 ప్రొఫెసర్లను, 54 మంది అసోసియేట్ ప్రొఫెసర్లను ఆయుష్ లో నియామకం చేస్తున్నాం అని వివరించారు.. సెంట్రల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ యోగా అండ్ ఆయుష్ ను అమరావతిలో నిర్మించబోతున్నారు.. గత ప్రభుత్వం రీసెర్చ్ సెంటర్ కు ఇచ్చిన స్ధలాన్ని వైఎస్ఆర్ కాలనీకి ఇవ్వడానికి లాక్కున్నారని మండిపడ్డారు.. అయితే, కేరళకు రాబోయో రోజుల్లో ఏపీని మోడల్ గా మార్చాలని సూచించారు.. స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద 166 కోట్లు ఆయూష్ కు ఏర్పాటు చేసాం.. 100 మంది ఆయుష్ మెడికల్ ఆఫీసర్లను నియమిస్తున్నాం అని వెల్లడించారు మంత్రి సత్యకుమార్‌ యాదవ్..

Exit mobile version