Fake Liquor Case: నకిలీ మద్యం తయారీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులోనూ మాజీ మంత్రి జోగి రమేష్.. ఆయన సోదరుడు జోగి రాము.. అంటే జోగి బ్రదర్స్‌ను నిందితుల జాబితాలో చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో భాగంగా, జోగి రమేష్, జోగి రాము పేర్లపై పీటీ వారెంట్ దాఖలు చేయగా, కోర్టు దీనికి అనుమతి ఇచ్చింది. తాజాగా పీటీ వారెంట్ అమల్లోకి రావడంతో, పోలీసులు ఈరోజు జోగి రమేష్ మరియు జోగి రామును ములకలచెరువు కేసులో స్థానిక కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
Read Also: Bollywood : హిందీలో ఆరు సినిమాలతో షేకాడిస్తున్న పాల బ్యూటీ
ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొంతమందిపై కూడా విచారణ జరుగుతోంది. నకిలీ మద్యం తయారీ, పంపిణీ, ఆర్థిక లావాదేవీలు సహా ఇతర అంశాలపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ పరిణామంతో నకిలీ మద్యం కేసు మళ్లీ రాజకీయ మరియు దర్యాప్తు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, నకిలీ మద్యం తయారీ కేసులో జోగి బ్రదర్స్ నలుగురు కుమారులకు సోమవారం రోజు నోటీసులు జారీ చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు.. రేపు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్న విషయం విదితమే.. ఇప్పటికే నకిలీ మద్యం తయారీ కేసులో జోగి బ్రదర్స్‌ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన ఎక్సైజ్ అధికారులు.. ఆ తర్వాత వారి కుమారులకు నోటీసులు జారీ చేయడం చర్చగా మారింది..
