AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో ఈ రోజు పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు PLR ప్రాజక్ట్స్ ఎండీ చెవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివా రెడ్డి. లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డి అరెస్టు తరువాత PLR సంస్థ ప్రతినిధులు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది సిట్. లిక్కర్ స్కాం కేసులో PLR సంస్థ ఖాతాల్లోకి డబ్బు బదిలి అయినట్లు మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది సిట్.. PLR ప్రాజక్ట్స్ బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు సిట్ అధికారులు.. కాగా, PLR ప్రాజెక్ట్స్ ఎంపీ మిథున్ రెడ్డికి చెందినది..
Read Also: AP Cabinet Decisions: మరో ముఖ్యమైన హామీ అమలు సిద్ధమైన ప్రభుత్వం.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్..
మరోవైపు, లిక్కర్ స్కాం కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై ఏసీబీ ప్రత్యేక న్యాస్థానంలో వాదనలు ముగిశాయి.. ఈ నెల 12వ తేదీన తీర్పు వెలువరించనుంది ఏసీబీ కోర్టు.. ఈ కేసులో ఏ31గా ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాజీ OSD కృష్ణ మోహన్ రెడ్డి.. ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ఇద్దరు నిందితులు.. ఇక, ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చుక్కెదురైంది.. స్విమ్స్ లో వైద్యం చేయించుకోవటం కోసం అనుమతి ఇవ్వాలని చెవిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్ చేసింది ఏసీబీ కోర్టు.. మరోవైపు, జైలుకి ఇంటి భోజనం అనుమతించాలని చెవిరెడ్డి
పిటిషన్ పై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. వారంలో మూడు రోజుల పాటు ఇంటి భోజనం పంపటానికి అనుమతి ఇచ్చింది న్యాయస్థానం.. లిక్కర్ కేసులో ఏ38గా ఉన్నారు చెవిరెడ్డి.. మరోవైపు, మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు రాజ్ కేసిరెడ్డి.. లిక్కర్ స్కాం కేసులో ఏ1గా ఉన్నాడు రాజ్ కేసిరెడ్డి.. ఈ నెల 11న విచారణ చేపట్టనుంది ఏసీబీ కోర్టు.. ఇప్పటికే ఒకసారి రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసిన విషయం విదితమే..
