గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంశీ సహా మరో ఇద్దరు నిందితుల పోలీస్ కస్టడీ ఆదేశాలు రద్దు చేయాలని ఏ7, ఏ8 తరఫు న్యాయవాది చిరంజీవి మెమో దాఖలు చేశారు. కస్టడీకి తీసుకున్న పోలీసులు ఎక్కడ వారిని విచారిస్తున్నారు అనే విషయాన్ని ముందుగానే వారి తరఫున న్యాయవాదులకు సమాచారం ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కస్టడీ సమయంలో మధ్యలో 3 నుంచి 4 సార్లు నిందితులతో వారి అడ్వకెట్లు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు పోలీసులు పాటించలేదని అసలు తమకు సమాచారం ఇవ్వలేదని కస్టడీ ఆదేశాలు రద్దు చేయాలని మెమో దాఖలు చేశారు. విచారణ అధికారులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు మెమోలో కోరారు. ఈ క్రమంలో రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.
Read Also: Mother: చేతులెలా వచ్చాయి తల్లీ.. భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లల హత్య..
వల్లభనేని వంశీ మోహన్‌ను కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్ట్ చేసిన విషయం విదితమే.. అయితే, వల్లభనేని వంశీ రిమాండ్‌ను పొడిగించింది కోర్టు.. మార్చి 11వ తేదీ వరకు వల్లభనేని వంశీ సహా నిందితుల రిమాండ్ పొడిగించారు. ఈ క్రమంలో.. వల్లభనేని వంశీతో పాటు మరో ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు.. మొదట నిందితులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.. ఆ తర్వాత ప్రశ్నించేందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో తొలి రోజు పోలీసుల కస్టడీ ముగిసింది. మొదటి రోజు మూడున్నర గంటలపాటు వంశీని పోలీసులు విచారించారు. వైద్య పరీక్షలకు విజయవాడ కృష్ణలంక ప్రభుత్వాసుపత్రికి వంశీని తరలించారు. వంశీ సహా ముగ్గురికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. వైద్య పరీక్షల తర్వాత విజయవాడ జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. మూడు రోజుల పాటు వల్లభనేని వంశీతో పాటు ముగ్గురిని ప్రశ్నించనున్నారు పోలీసులు.
Read Also: Odisha: ప్రభుత్వ పాఠశాల హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన 10వ తరగతి బాలిక..