NTV Telugu Site icon

Vijayawada Floods: వరద బాధితుల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు..

Police

Police

Vijayawada Floods: వరద బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు బెజవాడ పోలీసులు.. ఈ మేరకు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయం, విజయవాడ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు.. ఎన్టీఆర్‌ జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో వరదల వలన ముంపుకు గురైన ప్రాంతాలలోని బాధితులు లేదా ప్రజల వద్ద నుండి సదరు ఏరియాల్లో బోట్లు నడిపే వారు గాని.. పాల ప్యాకెట్లు, ఇతర ఆహార పదార్థాలను ఇచ్చే సమయంలో డబ్బులు వసూలు చేసే వారిని కానీ కస్టడీలోకి తీసుకుని కేసులు నమోదు చేస్తామని.. చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు సీపీ రాజశేఖర బాబు..

Read Also: Devara Daavudi: అనిరుధ్ ఆగాయా… టైగర్ ఫ్యాన్స్‌కు ఫెస్ట్ మిల్ గయా!

కాగా, విజయవాడలో రాజధానిలో భాగం.. ముంపు బారిన పడకుండా కార్యాచరణ రూపొందిస్తాం అన్నారు సీఎం చంద్రబాబు.. ఇదే సమయంలో.. వరద బాధతులను బోట్లల్లో తరలింపు కోసం డబ్బులు తీసుకుంటే కేసులు పెడతామని హెచ్చరించిన విషయం విదితమే.. ప్రైవేట్ బోట్ల వాళ్లూ డబ్బులు వసూలు చేయకూడదని స్పష్టం చేసిన ఆయన.. కష్టసమయంలో తరలింపు కోసం డబ్బులు తీసుకుంటే అరెస్ట్ చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.. ఇక, నిత్యావసర వస్తువుల ధరలు పెంచకుండా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.. నిత్యావసరాలు.. కూరగాయల ధరలకు ప్రభుత్వమే ఫిక్సడ్ రేట్ పెడతాం అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం విదితమే..