Jogi Ramesh Arrest: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జోగి రమేష్ కి ఎక్సైజ్ శాఖ అధికారులు సెర్చ్ వారెంట్ జారీ చేశారు. ఆయన ఇంట్లో తనిఖీలు చేసేందుకు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామ శివ పేరుతో నోటీసులు ఇచ్చారు. నకిలీ మద్యం కేసులో తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. నివాసం నుంచి బయటకు వచ్చిన జోగి రమేశ్.. తనిఖీలు అనంతరం జోగి రమేష్ ను అరెస్టు చేసి సిట్ కార్యాలయానికి తరలించారు.
అయితే, అంతకు ముందు జోగి రమేశ్ ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. ఇక, ఈరోజు తెల్లవారుజామున జోగి ఇంటికి పోలీసులు రావడంతో భారీగా జోగి అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.. కూటమి ప్రభుత్వం, పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాగా, సుమారు 3 గంటల పాటు రమేశ్ డోర్ తీయక పోవడంతో ఇంటి బయటనే పోలీసులు పడిగాపులు కాచారు. అనంతరం ఉదయం 8 గంటల సమయంలో ఇంటి డోర్ ఓపెన్ చేయటంతో జోగితో పోలీసులు మాట్లాడి.. నోటీసులు అందజేసిన తర్వాత అరెస్ట్ చేయగా.. ఇక, ఇదే కేసులో జోగి రమేష్ తమ్ముడు జోగి రాముతో పాటు అనుచరుడు అరెపల్లి రామును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
