FAPTO Protest: ఉపాధ్యాయ ఉద్యోగుల హక్కుల కోసం ఫ్యాప్టో (FAPTO) పిలుపు ఇచ్చింది.. ఇవాళ ఉదయం 10 గంటలకు ధర్నాచౌక్ లో FAPTO పోరుబాట నిరసన ధర్నా చేపట్టనుంది.. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా ధర్నాకు సిద్ధం అయ్యారు ఉపాధ్యాయులు.. విజయవాడ ధర్నా చౌక్ కు వేలాది మంది ఉపాధ్యాయులు తరలిరానున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు పూర్తయినా ఏ ఒక్క హామీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని టీచర్లు విమర్శిస్తున్నారు..
Read Also: Hyderabad: నా పిల్లల్నే కొడతావా.. తండ్రి ప్రాణం తీసిన పిల్లల పంచాయితీ
ఉపాధ్యాయ ఉద్యోగుల డిమాండ్లు ఇవే..
* ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుండి తప్పించాలి
* మెరుగైన పీఆర్సీ, మధ్యంతర భృతి మంజూరు చేయాలి
* 30 వేల కోట్ల ఆర్థిక బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలి
* ప్లస్ టూ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయాలి
* పురపాలక ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సౌకర్యము, అర్బన్ ఎంఈఓ పోస్టులను మంజూరు చేయాలి
* సీపీఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానం, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెన్షనర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
* గురుకుల, ఆదర్శ,1998, 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్ల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలి
* అంతర్ జిల్లా బదిలీలలో స్పౌజ్ క్యాటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న వారందరికీ బదిలీ అవకాశం కల్పించాలి
