Spurious Liquor Case: ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యం కేసు తీవ్ర కలకలం రేపుతోంది.. అయితే, ఈ కేసులో నిందితులకు షాక్ ఇచ్చింది విజయవాడలోని ఎక్సైజ్ కోర్టు.. నకిలీ మద్యం తయారీ కేసులో ఏడుగురు నిందితులకు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది ఎక్సైజ్ కోర్టు.. ఐదు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.. ఈ కేసులో నిందితులుగా ఉన్న రవి, బాదల్ దాస్, ప్రదీప్ దాస్, శ్రీనివాస్ రెడ్డి, కళ్యాణ్, రమేష్ బాబు, అల్లా భక్షులను కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.. ఈ నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కస్టడీకి ఇస్తూ ఎక్సైజ్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.. మరోవైపు, అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు ఎక్సైజ్ శాఖ పోలీసులు.. గోవాకు చెందిన శిబూ, జనేష్‌ను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు.. తర్వాత చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె కోర్టులో హాజరుపరిచారు. ఇక, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత ఇద్దరు నిందితులను మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు పోలీసులు..
Read Also: SSMB 29 : బాహుబలి రేంజ్ లో సెట్ వేయిస్తున్న రాజమౌళి.. ఏంట్రా ఇది
