Egg Prices Fall: కోడి గుడ్డు ధర భారీగా పతనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Egg Prices Fall: ఒకప్పుడు కొండెక్కి కూర్చుకున్న కోడి గుడ్డు ధర ఇప్పుడు భారీగా పతనం అవుతోంది.. కోడి గుడ్డు ధరలు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో గల్ఫ్ దేశాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కోడి గుడ్డు ధర ఇప్పటికే రూ.4.50 వరకు పడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే గుడ్డు ధర రూ.3 వరకు పడిపోవచ్చని పౌల్ట్రీ రంగానికి చెందిన వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Special Officers Rule in AP: ఏపీలో ప్రత్యేక అధికారుల పాలన..
Also Read
- Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
గల్ఫ్ దేశాలకు గుడ్ల సరఫరా నిలిచిపోవడం వల్ల మార్కెట్‌లో సరఫరా పెరిగి ధరలు క్షీణిస్తున్నాయని వారు చెబుతున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే పౌల్ట్రీ రైతులు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల వివరాల ప్రకారం, ఒక్క గుడ్డు తయారీకి సుమారు రూ.4 వరకు ఖర్చు అవుతుంది. అయితే ప్రస్తుతం ధరలు ఆ స్థాయికి కూడా రాకపోవడం వల్ల రైతులు నష్టాలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోంది. పౌల్ట్రీ ఫారమ్‌ల నుంచి వినియోగదారుడి వరకు గుడ్లు చేరేందుకు సాధారణంగా సుమారు 12 రోజుల సమయం పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ గడువు దాటితే గుడ్లు పాడైపోయే ప్రమాదం ఉండటంతో వాటిని రోడ్లపై పారబోయాల్సిన పరిస్థితి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ దేశాలకు గుడ్ల ఎగుమతి అవకాశాలు కల్పించడం, అలాగే దేశంలో గుడ్ల వినియోగాన్ని పెంచే చర్యలు చేపట్టాలని పౌల్ట్రీ రంగానికి చెందిన వ్యాపారులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్‌తో సరికొత్త లైనప్
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్‌సైడ్ ఉందంటున్న నోమురా!
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
-
Prabhas : మలయాళం ఊచకోత డైరెక్టర్ తో ప్రభాస్?
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!