Site icon NTV Telugu

Drunk and Drive: బెజవాడలో మందుబాబుల హల్‌చల్‌

Drunk And Drive

Drunk And Drive

Drunk and Drive: బెజవాడలో మందుబాబులు హల్‌చల్‌ చేశారు.. మద్యం తాగి కారు నడిపి విధ్వంసం సృష్టించారు.. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బబ్బులు గ్రౌండ్ దగ్గరకు కిట్టు, అరుణ్ మద్యం సేవించి కారు నడుపుతూ వచ్చాడు.. మద్యం మత్తులో కారు ఎలా నడుపుతున్నాడో కూడా తెలియని పరిస్థితిలో.. దంపతులను ఢీకొట్టాడు.. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేశారు.. ఇక, అడ్డుకున్న పోలీసులతో.. వాగ్వాదానికి దిగారు. కారుపై మాజీ మంత్రి జోగు రమేష్ స్టిక్కర్ అన్నట్టు పోలీసులు గుర్తించారు. గతంలో వీరుపై కిడ్నాప్, కార్ రేసింగ్ కేసులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.. అరుణ్‌ ను పోలీసులు అదుపులో తీసుకోగా.. కిట్టు పరారయ్యాడు.. కారు సీజ్ చేసిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా, మందు బాబులు ఫుల్ట్‌గా మద్యం సేవించి హల్‌చల్‌ చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. మద్యం సేవించి.. ఇష్టం వచ్చినట్టు వాహనాలను నడుపుతూ.. వారు ప్రమాదంలో పడడమే కాదు.. అవతలివాళ్లను కూడా ప్రమాదంలోకి నెట్టుతున్నారు.. ప్రాణాలు కూడా తీస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి..

Read Also: IPL 2025 MS Dhoni: ఐపీఎల్ 2025లో ఎంఎస్ ధోనీ ఆడతాడా?.. సీఎస్‌కే సమాధానం ఇదే!

Exit mobile version