Site icon NTV Telugu

Diarrhea In Vijayawada: విజయవాడలో రోజు రోజుకు పెరుగుతున్న డయేరియా కేసులు.. ఏకంగా 350!

Vja

Vja

Diarrhea In Vijayawada: విజయవాడలోని కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. గత కొన్ని రోజులు నుంచి ఈ వ్యాధి కేసులు క్రమంగా పెరుగుతునే ఉన్నాయి. ప్రస్తుతం బాధితుల సంఖ్య 350 దాటింది. అయితే, గత రాత్రి మరో 15 మంది డయేరియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో, వారిని వెంటనే ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో డయేరియాతో బాధపడుతున్న రోగులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

Read Also: IND vs PAK: పాకిస్థాన్‌ మ్యాచ్‌లో ప్రత్యేకమైన నిరసన.. శభాష్ సూర్యకుమార్!

న్యూరాజారాజేశ్వరిపేటలో కొత్తగా డయేరియా కేసులు నమోదు అయ్యాయి. డయేరియా బాధితులు నివాసం ఉండే ప్రాంతంలో తీసుకున్న నీటి శాంపిల్స్ కు సంబంధించిన రిపోర్ట్స్ ఇంకా రాలేదు. దీంతో న్యూ రాజరాజేశ్వరి పేట నివాసులు ఆందోళనలో భయంతో గడుపుతున్నారు. ఇప్పటికే రెండు కిలోమీటర్ల పరిధిలో షాపులను ఫుడ్ కంట్రోల్ అధికారులు మూయించారు. ఇంటింటికి మంచి నీటి క్యాన్లను పంపిణీ చేస్తున్నారు. ప్రతి‌ ఇంటికి శానిటైజేషన్ కిట్లను అధికారులు అందజేస్తున్నారు.

Exit mobile version