Diarrhea: విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు పెరుగుతుంటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ వ్యాధి కేసులు పెరుగుతూ ఉండగా, ప్రస్తుతం బాధితుల సంఖ్య 300కు దాటింది. అయితే, గత రాత్రి మరో 20 మంది డయేరియా లక్షణాలతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో, వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 145 మందికి పైగా రోగులు ట్రీట్మెంట్ పొందుతున్నారు.
Read Also: Vizag: దివ్యాంగులకు కృత్రిమ చేతుల తయారీ
అయితే, ఈ వ్యాధి విజృంభణతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు డయేరికా వ్యాప్తికి గల కారణాలను ఆన్వేషించే ప్రయత్నం చేస్తున్నారు. బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు హెల్త్ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక, డయేరియా కారణంగా మరణించిన బాధిత కుటుంబాలను వైసీపీ నిజనిర్ధారణ కమిటీ పరామర్శించింది. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించే దిశగా తగిన చర్యలు తీసుకుంటామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
