Site icon NTV Telugu

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్‌ కేసులో కీలక పరిణామం.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అరెస్ట్..

Ap Liquor Scam Case

Ap Liquor Scam Case

AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న రిటైర్డ్ IAS అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి OSD కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్‌ చేసశారు సిట్‌ అధికారులు.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని అరెస్ట్‌ చేసినట్టు అధికారికంగా ప్రకటించారు సిట్‌ అధికారులు.. మరోవైపు.. లిక్కర్‌ స్కామ్‌ కే సులో ఈ ఇద్దరి నిందితుల ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం విదితమే..

Read Also: Balochistan: బలూచిస్తాన్ పరిణామాల నేపథ్యంలో.. పాక్‌లోని ఈ రెండు హిందూ ఆలయాలపై చర్చ..

లిక్కర్ స్కామ్‌ కేసులో మొత్తంగా ఏడుగురుని అరెస్ట్‌ చేశారు పోలీసులు.. ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డి, ఏ6 సజ్జల శ్రీధర్ రెడ్డి, ఏ8 చాణక్య, ఏ30 దిలీప్, ఏ33 గోవిందప్ప బాలాజీని ఇప్పటికే అరెస్ట్‌ చేయగా.. ఈ రోజు ఏ31 ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణ మోహన్ రెడ్డిని అరెస్ట్‌ చేసినట్టు ప్రకటించారు.. మొదట డిస్టలరేస్ నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేసింది సిట్‌.. ఇక, మూడు రోజులుగా ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను విచారిస్తున్న సిట్.. మూడో రోజున ఇద్దరిని అరెస్టు చేస్తున్నట్టు వెల్లడించింది.. అయితే, లిక్కర్ స్కాం కేసును మొదట విచారించిన సీఐడీ.. తర్వాత సిట్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే..

Read Also: Rohit Sharma: వాంఖడేలో ‘రోహిత్ శర్మ’ స్టాండ్‌ ఆవిష్కరణ.. క్రికెట్ దిగ్గజాల సరసన హిట్ మ్యాన్

ఈ కేసులో ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, దిలీప్‌ను కస్టడీకి తీసుకొని విచారించింది సిట్‌.. గోవిందప్ప బాలాజీ ను కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ పై కోర్టులో ఇవాళ విచారణ జరగగా.. ఈ నెల 19కి తదుపరి విచారణ వాయిదా వేసింది.. మొత్తం స్కామ్‌ విలువ రూ.3,200 కోట్లుగా చెబుతున్నారు.. ఇప్పటి వరకు నిందితుల సంఖ్య 33గా ఉంది.

Exit mobile version