Vijayawada Kanaka Durga: అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి.. కనకదుర్గమ్మ భక్తులకు బాలాత్రిపురసుందరిగా దర్శనం ఇస్తున్నారు.. అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచి భక్తులు క్యూలైన్లలో వస్తున్నారు.. తెలంగాణ, ఏపీ నుంచి భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నారు.. ఈసారి ప్రభుత్వం అద్భుతంగా ఏర్పాట్లు చేసిందంటున్నారు భక్తులు.. మరోవైపు..ఇంద్రకీలాద్రి పై కొలువైన కనకదుర్గమ్మకు ఖరీదైన వజ్రాల కిరీటం అందజేశారు ముంబైకి చెందిన సౌరభ్.. అలాగే సీఎం రమేష్ అనే భక్తుడు సూర్యచంద్రులను, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భక్తురాలు హైమవతి సూర్యకుమారి బొట్టును అందజేశారు.. మొత్రం అభరణాలు వజ్రాలు పొదిగినవే.. 2 కోట్ల విలువైన కిరీటం దసరా నవరాత్రులలో ప్రత్యేకం కానుంది.. అమ్మవారి వజ్రాభరణాల అలంకరణ వైదిక విధానంలో హోమాదులు నిర్వహించి అలంకరిస్తామని ఆలయ పండితులు శంకరశాండిల్య వెల్లడించారు..
Read Also: Bathukamma Day-2: నేడు అటుకుల బతుకమ్మ.. విశిష్టత ఇదే..
మరోవైపు, దుర్గగుడిలో దసరా ఉత్సవాల సేవాకమిటీని నియమించింది ఏపీ ప్రభుత్వం.. శ్రీ దుర్గా సేవాకమిటీ పేరుతో 56 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఈనెల 3వ తేదీ నుంచి 12 వ తేదీ వరకు జరిగే “దసరా నవరాత్రులు ఉత్సవాల్లో భక్తులకు, యాత్రికులకు సేవ చేసేందుకు 56 మంది సభ్యులను నియమింవినట్లు ప్రకటించింది.. ఇక, వృద్ధులు, వికలాంగులు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.. ఈ సంవత్సరం దసరా ఉత్సవాలలో స్టెయిర్ లిఫ్ట్ ప్రత్యేకంగా నిలుస్తోంది.. స్టెయిర్ లిఫ్ట్ వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మెట్లు ఎక్కి దిగే ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం..