Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: మన ప్రథమ బాధ్యత అడవులను కాపాడటం.. పవన్‌ కల్యాణ్‌ పిలుపు..

Deputy Cm Pawan Kalyan

Deputy Cm Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: మన అందరి ప్రథమ బాధ్యత అడవులను కాపాడటం.. దాని కోసం అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. విజయవాడలో రాష్ట్ర స్థాయి అటవీశాఖ అధికారుల వర్క్ షాపులో పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నేను చాలా ఇష్టంతో ఎంచుకున్నవి పర్యావరణం, అటవీ శాఖలు అన్నారు. ఒక వ్యవస్థ నడవాలి అన్నా.. ఒక సంస్థ ముందుకు వెళ్ళాలి అన్నా.. వాటిని నడిపే వ్యక్తులు చాలా ముఖ్యం అన్నారు.. రివ్యూ మీటింగుల ద్వారా సిబ్బంది కొరత ఉన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇక్కడున్న అధికారులకు పని భారం ఎక్కువ ఉంది.. నేను అర్థం చేసుకోగలను.. ఈ సమస్య గురించి కేబినెట్ లో కూడా ప్రస్తావించాను అన్నారు.. ఎట్టి పరిస్థితుల్లో డ్యూటీ చేసే అధికారులను ఇబ్బంది పెడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.. ఈ విషయం కూటమి పార్టీల నాయకులకు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు పవన్‌ కల్యాణ్‌.

Read Also: PM Modi: భారతరత్న కర్పూరి ఠాకూర్‌కు నివాళులర్పించి బీహార్‌లో మోడీ ప్రచారం ప్రారంభం

ఫ్రంట్ లైన్ అటవీ సిబ్బంది చాలా కష్టమైన పరిస్థితుల్లో పని చేస్తూ ఉంటారు.. వారి భద్రత, సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు పవన్‌ కల్యాణ్‌.. మనందరి ప్రథమ బాధ్యత అడవులను కాపాడటం.. ఉన్న 22 శాతంలోనే పచ్చదనం తక్కువ ఉంది దాన్ని పెంపొందించడం.. మరోటి 2047 కి 50 శాతానికి చేరుకోవడం అన్నారు.. అయితే, ఇది కష్టతరమైన విషయం, అంత తేలికైనదికాదన్నారు.. కానీ, ఎలా చేరుకోగలము అని మీతో అధికారులతో, నిపుణులతో చర్చించి ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్..

ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో 5 కోట్ల నిధిని అటవీ సిబ్బంది సంక్షేమం కోసం ఏర్పాటు చేశాం అన్నారు పవన్‌. కొత్త సిబ్బంది నియామకాల్లో సిఫార్సులకు తావులేదన్న ఆయన.. మొన్న అమరవీరుల దినోత్సవానికి గుంటూరు వెళ్ళినప్పుడు అటవీ సిబ్బంది సంక్షేమ నిధిని ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం ఉంది అని నా దృష్టికి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ మనం ప్రారంభించాం. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ఉన్న మన తీర ప్రాంతం సంరక్షణకు ఇది గొప్ప ప్రయత్నం. ఉదాహరణకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో పది పది అడుగుల చొప్పున ప్రతి సంవత్సరం కోతకు గురి అవుతూ ఉంది. ఈ కోతను అరికట్టడానికి 974 కిలోమీటర్ల తీర ప్రాంత సంరక్షణకు ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ దోహద పడుతుందని తెలిపారు పవన్‌ కల్యాణ్‌..

Exit mobile version