Deputy CM Pawan: విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ లో స్త్రీశక్తి పథకం ప్రారంభించిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. బలమైన అకుంఠిత దీక్ష ఉన్న వ్యక్తి సీఎం చంద్రబాబు.. మన రాష్ట్ర ఆడపడుచులకు ప్రత్యేక ధన్యవాదాలు.. కూటమి ప్రభుత్వం నేటి నుంచి మహిళలకు, బాలికలకు, ట్రాన్స్ జెండర్ల కోసం ఈ పథకం అమలు చేస్తోంది.. కనీసం రూ. 2000 కోట్లు ఏడాదికి ఖర్చు చేసి ఈ పథకం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 8, 458 బస్సులు ఉచిత ప్రయాణానికి అందుబాటులో ఉంటాయి.. నిర్ణీత ఐడీ చూపించి 5 రకాల బస్సులలో స్త్రీ శక్తి పథకం అమలు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
Read Also: Mahindra new SUVs 2025: ఇండిపెండెన్స్ డే గిఫ్ట్.. మహీంద్రా నుంచి 4 కొత్త SUV లు రిలీజ్
అయితే, ప్రతీ బస్సులోనూ సీసీ కెమెరాలు, బాడీ వార్న్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు. ఉండవల్లి నుంచి వస్తుంటే మహిళలతో మాట్లాడుతుంటే రూ. 1500 నుంచి 2 వేల రూపాయల వరకూ పొదుపు అవుతుందని చెపుతున్నారు.. పథకాలు ముందుకు తీసుకెళ్ళడానికి మాపై ప్రజలు పెట్టిన భరోసా కారణం.. ఆ భరోసానే ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం తెచ్చింది.. వైజాగ్ స్టీల్ ప్లాంట్, అమరావతికి నిధులు రావడానికి మార్గ నిర్దేశకత్వం చేసిన మోడీ, చంద్రబాబుకు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు.
